ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జ్వరాల బారిన జనం

ABN, First Publish Date - 2022-05-16T07:14:52+05:30

ఇటీవల వర్షాలు కురుస్తున్నాయి. ఏ పల్లె, పట్టణం చూసినా అపరిశుభ్రత తాండవిస్తోంది. వీధుల వెంట మురు గునీరు పారుతోంది.

జిల్లా ఆస్పత్రిలో రెండురోజుల క్రితం ఓపీ వద్ద క్యూకట్టిన జ్వర బాధితులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పడకేసిన పారిశుఽధ్యం

పంచాయతీల్లో పైసలు కరువు

చేతులెత్తేసిన సర్పంచులు, వైద్య సిబ్బంది

శాఖల మధ్య సమన్వయలోపం

నిద్రమత్తులో ఉన్నతాధికారులు

అనంతపురం టౌన మే 15:  ఇటీవల వర్షాలు కురుస్తున్నాయి. ఏ పల్లె, పట్టణం చూసినా అపరిశుభ్రత తాండవిస్తోంది. వీధుల వెంట మురు గునీరు పారుతోంది. కాలువల్లో పూడిక తీసేవారే కరువయ్యారు. రోడ్లలో చెత్తాచెదారం దర్శనమిస్తోంది. పారిశుధ్యం పడకేయడంతో రోగాలు విజృం భిస్తున్నాయి. అప్పుడే జ్వరాల బాధితులు ప్రతి గ్రామాల్లోనూ పెరిగిపో తున్నారు. పట్టణాల్లోనూ ఇదే దుర్భర పరిస్థితి కనిపిస్తుండడంతో జ్వరాల బారిన పడి విలవిలలాడుతున్నారు. సాధారణ జ్వరాలతో పాటు మలేరి యా, డెంగీ, టైఫాయిడ్‌ వంటి జ్వరాలు జనంపై దాడి చేస్తున్నాయి. సీజనల్‌గా అధికారులు తగిన ముందస్తు చర్యలు తీసుకోవాలి. అయితే అధికార యంత్రాంగం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.  ఇటీవల కొద్దిరోజులుగా జిల్లా వ్యాప్తంగా అడపాదడప వర్షాలు పడుతున్నాయి. దీంతో దోమలు పెరిగి జ్వరాలతో ఆస్పత్రులవైపు పరుగులు తీస్తున్నారు. 


అటకెక్కిన ఫాగింగ్‌ యంత్రాలు

దోమల బెడద నివారణకు ప్రతి పంచాయతీకి ఒక ఫాగింగ్‌ పరికరాన్ని దాదాపు నాలుగేళ్ళ క్రితం కొనుగోలు చేశారు. అదే సమయంలోనే మున్సి పాలిటీలకు ఫాగింగ్‌ యంత్రాలు కొన్నారు. అప్పట్లో మాత్రం హడావిడిగా దోమల నివారణకు ఫాగింగ్‌ చేపట్టారు. ఇప్పుడు ఆ ఫాగింగ్‌ యంత్రాలు ఏమయ్యాయో, ఎక్కడున్నాయో తెలీయడం లేదు. దాదాపు 80శాతం పంచాయతీల్లో ఫాగింగ్‌ యంత్రాలు అదృశ్యం అయిపోయాయని అధికార వర్గాలే చెబుతున్నాయి. పంచాయతీ, మున్సిపాలిటీలు ఇలాంటి సమయం లో డ్రైనేజి, వీధులను శుభ్రం చేయాలి. గుంతల్లో నీరు నిల్వ లేకుండా చూడాలి. దోమలు పెరగకుండా లార్వాను చంపడానికి మురుగుగుంతల్లో ఆయిల్‌ బాల్స్‌ వేయాలి. తేమ ఉన్న ప్రాంతాల్లో బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లాలి. కానీ ఎక్కడా అధికారులు పట్టించు కోవడం లేదు. అయినా ఉన్నతాధికా రులు మాత్రం నిద్రమత్తులో తూగుతూ జనం ఆరోగ్యంతో ఆడుకుంటు న్నారు. 


పంచాయతీలకు పైసలు కరువు... 

గ్రామాల్లో పరిశుభ్రత చూడాల్సిన బాధ్యత సర్పంచలపై ఉంటుంది. అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పారిశుధ్యం కోసం సీజనల్‌ వ్యాధుల సమయంలో జాతీయ ఆరోగ్యమిషన (ఎనహెచఎం) ద్వారా ప్రత్యేక నిధులు కేటాయిస్తూ రావడం జరుగుతోంది. అయితే ఈసారి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం వెనక్కు తీసేసుకొని ఇతర వాటికి వాడుకోవడం జరిగింది. పైసలు లేక సర్పంచలు కూడా పారిశుధ్యం నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోలేక ఉండిపోతున్నారు. ఇక గ్రామ స్థాయిలో పర్యవేక్షించే రెవెన్యూ, పంచాయతీరాజ్‌ అధికారులు సైతం తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.


జిల్లా ఆస్పత్రికి పెరిగిన రోగులు

 సర్వజన ఆస్పత్రికి సాధారణ జ్వర బాధితులు సైతం పెద్దసంఖ్యలోనే వస్తున్నారు. గత నాలుగైదు రోజులుగా రోజుకు 1200 నుంచి 1500 మంది వరకు వివిధ వ్యాధులతో బాధపడుతూ ఆస్పత్రికి వస్తున్నారు. ఇందులో సగం మందికి పైగా జ్వరాలతో బాధపడుతూ చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి వస్తున్నవారిలో ఉన్నారు. ఇక ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్ళే వారు ఎందరో ఉన్నారు. దీన్నిబట్టే జిల్లాలో జ్వరాల ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థమౌ తోంది. జిల్లాలో పీహెచసీలు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు ఉన్నా రోగులకు వైద్యసేవలు అందడం లేదు. డాక్టర్లు సక్రమంగా విధులకు హాజరు కాకపోవడంతో పాటు అవసరం మేరకు మందులు లేకపోవడంతో బాధితులను రెఫర్‌ చేసి చేతులు దులుపుకుంటున్నారు.  


సీజనల్‌ వ్యాధులపై దృష్టి పెట్టాం...

 వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు మొదలవుతాయి. అందుకే సీజనల్‌ వ్యాధులపై ప్రత్యేక దృష్టి పెట్టాం. గతంలో ఏఏ ప్రాంతంలో జ్వరాలు విజృంభించాయి.. ప్రధానంగా డెంగీ, మలేరియా జ్వరాలు ఏ ప్రాంతంలో అధికంగా నమోదవుతూ వస్తున్నాయో గుర్తించి ఆ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. ఆ ప్రాంత ప్రజలకు అవసరమైన వైద్యసేవలు అంది స్తాం. ఇతర శాఖలను సమన్వయం చేసుకొని సీజనల్‌ వ్యాధుల నివార ణకు చర్యలు చేపడుతున్నాం. 

 - డాక్టర్‌ విశ్వనాథయ్య, డీఎంహెచఓ


Updated Date - 2022-05-16T07:14:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising