ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీటీపీకి కొనసాగుతున్న వరద

ABN, First Publish Date - 2022-10-08T05:14:18+05:30

జిల్లాలోని భైరవాన్‌తిప్ప రిజర్వాయర్‌కు దాదాపు 70 రోజులుగా వరదనీటి ఉధృతి కొనసాగుతూనే వుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 గుమ్మఘట్ట, అక్టోబరు 7: జిల్లాలోని భైరవాన్‌తిప్ప రిజర్వాయర్‌కు దాదాపు 70 రోజులుగా వరదనీటి ఉధృతి కొనసాగుతూనే వుంది. గత 40 యేళ్ల చరిత్రలో ఎన్నడూలేని విధంగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో బీటీపీ నుంచి 38 టీఎంసీల మేర నీటిని దిగువకు విడుదల చేశారు. కర్ణాటక హిరయూరు వద్ద వున్న వాణివిలాస్‌ ప్రాజెక్టు  పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరి మరువ పారుతుండటంతో  బీటీప్రాజెక్టుకు వరదనీటి ప్రవాహం కొనసాగుతూనే వుంది. ప్రస్తుతం బీటీపీ నుంచి రెండు గేట్ల ద్వారా 3800 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. మరో కొన్ని నెలలపాటు ఈ వరదనీటి ప్రవాహం కొనసాగుతుందని ఇరిగేషన్‌ అధికారులు పేర్కొంటున్నారు. బీటీపీ నుంచి వేదావతి హగరి వరదనీటి ప్రవాహంతో రాయదుర్గం, బ్రహ్మసముద్రం మండలాల రాకపోకలు దాదాపు రెండు నెలలుగా నిలిచిపోయాయి. గుమ్మఘట్ట సమీపంలోని వేపులపర్తి, గుమ్మఘట్ట ప్రధాన కాజ్‌వే తెగిపోవడంతో దాదాపు 30 గ్రామాల ప్రజలు రాయదుర్గం వెళ్లాలంటే 30 కిలోమీటర్ల చుట్టేసుకుని వెళ్లాల్సి వస్తోంది. కన్నేపల్లి, బుడిమేపల్లి, భూపసముద్రం తదితర ప్రాం తాల వద్ద రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 


Updated Date - 2022-10-08T05:14:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising