ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తుంగభద్ర డ్యాం నుంచి వంద టీఎంసీలు కేటాయించాలి

ABN, First Publish Date - 2022-09-14T05:25:25+05:30

తుంగభద్ర డ్యాం నుంచి జిల్లాకు వంద టీఎంసీల నీటిని కేటాయించాలని మేధావులు, ఇంజనీర్లు డిమాండ్‌ చేశారు. జలసాఽధన సమితి, జలవనరుల శాఖ విశ్రాంత ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ విశ్వనాథం సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక ఏఎఫ్‌ ఎకాలజీ సెంటర్‌లో ‘జిల్లాలో నీటి లభ్యత, కొత్త ప్రాజెక్ట్‌ల ప్రతిపాదనల’పై సమీక్షాసమావేశం నిర్వహించారు.

సమావేశంలో చర్చిస్తున్న మేధావులు, ఇంజనీర్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 మేధావులు, ఇంజనీర్ల డిమాండ్‌

అనంతపురం క్లాక్‌టవర్‌, సెప్టెంబరు 13 : తుంగభద్ర డ్యాం నుంచి జిల్లాకు వంద టీఎంసీల నీటిని కేటాయించాలని మేధావులు, ఇంజనీర్లు డిమాండ్‌ చేశారు. జలసాఽధన సమితి, జలవనరుల శాఖ విశ్రాంత ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ విశ్వనాథం సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక ఏఎఫ్‌ ఎకాలజీ సెంటర్‌లో ‘జిల్లాలో నీటి లభ్యత, కొత్త ప్రాజెక్ట్‌ల ప్రతిపాదనల’పై సమీక్షాసమావేశం నిర్వహించారు. మేధావులు, ఇంజనీర్లు చేసిన తీర్మానాలను ఏఎఫ్‌ ఎకాలజీ సెంటర్‌ డైరెక్టర్‌ మల్లారెడ్డి వెల్లడించారు.

 ఉమ్మడి జిల్లాలో నీటి అవసరాలపై ఉంతకల్లు, పెరవలి రిజర్వాయర్ల నిర్మాణం ఎంతో అవసరం.

 పీఏబీఆర్‌ పూర్తి నీటి సామర్థ్యం 11 టీఎంసీలకు సంబంధించిన భూసేకరణ, పూడికతీతకు అవసరమైన రూ.450కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలి.

 కర్ణాటక పశ్చిమ కనుమలో ఉన్న శరావతి నదిపై నిర్మించిన లింగమకిక రిజర్వాయర్‌ నుంచి వచ్చే వరద నీటిని 86కిలోమీటర్ల కాలవ తవ్వకం ద్వారా భద్ర రిజర్వాయర్‌, తుంభద్ర డ్యాం నుంచి జిల్లాకు 100టీఎంసీల నీటిని కేటాయించి తీసుకురావడం.

 జిల్లాలో భూగర్భ జలాలను పెంపొందించే, గుర్తించే సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురావడం.

 కేంద్రప్రభుత్వ రంగ సంస్థ నేషనల్‌ వాటర్‌ డెవల్‌పమెంట్‌ ఏజెన్సీ రూపొందించిన ఆల్మట్టి నుంచి బుక్కపట్నం చెరువు వరకు 45టీఎంసీల నీటిని గురుత్వాకర్షణ ద్వారా తరలించే ప్రతిపాదనలు అమలు చేయడం.


Updated Date - 2022-09-14T05:25:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising