ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గంగమ్మకు హారతి

ABN, First Publish Date - 2022-11-24T00:17:56+05:30

కార్తీక మాసం చివరి రోజున జిల్లా వ్యాప్తంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలను నిర్వహించుకున్నారు. కార్తీక అమావాస్యను పురస్కరించుకుని శివాలయాలలో బుధవారం దీపాలను వెలిగించారు. నగరంలోని హెచ్చెల్సీ కాలనీ మంజునాథస్వామి ఆలయం వద్ద గంగా హారతి నేత్రపర్వంగా సాగింది. ఆలయంలో మంజునాథస్వామి, భ్రమరాంభికను ప్రత్యేకంగా అలంకరించారు.

గంగా దేవికి హారతి ఇస్తున్న భక్తులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శివయ్య సన్నిధిలో కార్తీక వేడుక..

నేత్రపర్వంగా చివరి రోజు పూజలు

అనంతపురం కల్చరల్‌, నవంబరు 23:

కార్తీక మాసం చివరి రోజున జిల్లా వ్యాప్తంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలను నిర్వహించుకున్నారు. కార్తీక అమావాస్యను పురస్కరించుకుని శివాలయాలలో బుధవారం దీపాలను వెలిగించారు. నగరంలోని హెచ్చెల్సీ కాలనీ మంజునాథస్వామి ఆలయం వద్ద గంగా హారతి నేత్రపర్వంగా సాగింది. ఆలయంలో మంజునాథస్వామి, భ్రమరాంభికను ప్రత్యేకంగా అలంకరించారు. విశేష పూజాలు చేశారు. భక్తులు సామూహికంగా స్వామివారికి సహస్రనామార్చన చేశారు. శివదీక్ష స్వాములు ఆలయం వద్ద నుంచి హెచ్చెల్సీ వరకూ భక్తి ప్రదర్శన చేశారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ గంగమ్మకు హారతులు పట్టారు. భక్తులు కార్తీక దీపాలు వెలిగించి నీటిలో వదిలారు. ఆలయంలో మహా మంగళహారతి పట్టి.. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకుడు మఠం బసవరాజు, విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-24T00:17:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising