ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్టీఆర్‌ పేరు కొనసాగించాలి ..

ABN, First Publish Date - 2022-09-24T05:31:15+05:30

హెల్త్‌ యూనివర్సిటీకి నందమూరి తారక రామారావు పేరును కొనసాగించాలని టీఎన్‌ఎ్‌సఎఫ్‌ నాయకులు డిమాండ్‌ చేశారు

నిరసన తెలుపుతున్న నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీఎన్‌ఎస్‌ఎఫ్‌ డిమాండ్‌

అనంతపురం విద్య, సెప్టెంబరు 23: హెల్త్‌ యూనివర్సిటీకి నందమూరి తారక రామారావు పేరును కొనసాగించాలని టీఎన్‌ఎ్‌సఎఫ్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. క్లాక్‌ టవర్‌ వద్ద శుక్రవారం వారు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం కక్షపూరిత పాలన సాగిస్తోందని మండిపడ్డారు. వైఎస్‌ జగన్‌ నీచ రాజకీయాలు  చేయడం దారుణమని అన్నారు. రాష్ట్రంలోని ప్రజలు, విద్యార్థులు, నిరుద్యోగులు తుగ్లక్‌ పాలన చూసి సిగ్గుతో తలదించుకుంటున్నారని అన్నారు. వైద్య విద్యకు ప్రత్యేక గుర్తింపు ఉండాలని ఏపీ హెల్త్‌ యూనివర్సిటీని ఎన్టీఆర్‌ స్థాపించారని, చంద్రబాబునాయుడు హయాంలో దానికి ఎన్టీఆర్‌ పేరు పెట్టారని అన్నారు. ఏ ముఖ్యమంత్రీ ఆ పేరును మార్చలేదని గుర్తు చేశారు. ఇప్పటి ప్రభుత్వం కేవలం కక్షపూర్తితంగా నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయంతో 2022-23 విద్యాసంవత్సరంలో ఎంబీబీఎస్‌, ఆయుర్వేదిక్‌, హోమియో తదితర కోర్సులు చదువుతున్న సుమారు 30 వేల మంది ఇబ్బంది పడే ప్రమాదం ఉందని అన్నారు. సీఎం తన నిరంకుశ నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేదంటే ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో టీఎనఎ్‌సఎ్‌ఫ జిల్లా అధ్యక్షుడు గుత్తా ధనుంజయనాయుడు, రాష్ట్ర నాయకులు లక్ష్మీనరసింహ, జిల్లా ప్రధాన కార్యదర్శి బాల లోకేష్‌ యాదవ్‌, నాయకులు గుర్రం కిరణ్‌, భార్గవ్‌, సునీల్‌, మురళి, పవన్‌ తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2022-09-24T05:31:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising