ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మద్యం దుకాణం వద్దే వద్దు

ABN, First Publish Date - 2022-10-04T04:26:25+05:30

పట్టణంలోని మన్రో సత్రం వద్ద మద్యం దుకాణం ఏర్పాటును స్థానికులు సోమవారం అడ్డుకున్నారు.

ధర్నా చేస్నున్న టీడీపీ, సీపీఐ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 - గుత్తిలో జనం ఆందోళన 

- టీడీపీ, సీపీఐ మద్దతు

గుత్తి, అక్టోబరు 3: పట్టణంలోని మన్రో సత్రం  వద్ద మద్యం దుకాణం ఏర్పాటును స్థానికులు సోమవారం అడ్డుకున్నారు. వారికి టీడీపీ, సీపీఐ నాయకులు మద్దతు పలి కారు. ఎక్సైజ్‌ అధికారులు ఓ గదిని అద్దెకు తీసుకుని, మద్యం దుకాణం ఏర్పాటుకు ప్రయత్నిస్తుండగా, కాలనీవాసులు అడ్డుకున్నారు. సీపీఐ మండల కార్యదర్శి రామదాసు, పూలమాబు, రామక్రిష్ణ, టీడీపీ మండల కన్వీనర్‌ బర్దివలి, ఎస్సీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి దిల్‌కా శీనా, ఐటీడీపీ జిల్లా ఇనచార్జి పులికొండ, సాగునీటి సంఘం మాజీ అధ్యకుడు కేశవ నాయుడు, టైలర్‌ బాషా, పులికొండ, రంగారెడ్డి, రామరాజు, షుకూర్‌, వీరన్న, మహ్మద్‌ అలీ, తదితరులు ధర్నాకు దిగారు. ప్రభుత్వం మద్యం దుకాణాలను జనావాసాల మధ్య ఏర్పాటు చేయడం ఏమిటని నాయకులు ప్రశ్నించారు. దీంతో వైసీపీ నాయకులు అక్కడికి వచ్చి, అందోళనకారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. ఉద్రిక్తత ఏర్పడటంతో ఎస్‌ఐ శ్రీనివాసులు సిబ్బందితో వచ్చి ఇరువర్గాలను అక్కడి నుంచి పంపించారు. ఎక్సైజ్‌ అధికారులు మద్యం దుకాణాన్ని తొలగించారు.



Updated Date - 2022-10-04T04:26:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising