ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాఠశాల విలీనం వద్దే వద్దు!

ABN, First Publish Date - 2022-07-07T05:34:04+05:30

మండల పరిధిలోని మెళవాయి ప్రాథమికోన్నత పాఠశాలను ఉన్నత పాఠశాలలోకి విలీనం చేస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని పాఠశాల కమిటీ చైర్మన రంగనాథ్‌, వైస్‌చైర్మన శివానంద్‌లు స్పష్టం చేశారు.

బేగార్లపల్లి ఎంఈఓ కార్యాలయం ఎదుట విద్యార్థులు, తల్లిదండ్రుల ధర్నా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మడకశిర రూరల్‌, జూలై 6: మండల పరిధిలోని మెళవాయి ప్రాథమికోన్నత పాఠశాలను ఉన్నత పాఠశాలలోకి విలీనం చేస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని పాఠశాల కమిటీ చైర్మన రంగనాథ్‌, వైస్‌చైర్మన శివానంద్‌లు స్పష్టం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఆధ్వర్యంలో బుధవారం పాఠశాల ఎదుట ఆందోళన చేశారు. 45 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలను దూరంగా ఉన్న పాఠశాలకు విలీనం చేస్తే ఎలాగని ప్రశ్నించారు. రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న సిద్ధిగిరి ఉన్నత పాఠశాలలోకి విలీనం చేస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. విద్యార్థులకు అనుకూలంగా పాఠశాలను ఇక్కడే కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. 

మడకశిర టౌన: నగరపంచాయితీ పరిధిలోని బేగార్లపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలలోకి విలీనం అపాలని కోరుతు బుధవారం విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు, విద్యార్థి సంఘం నాయకులు, టీడీపీ నాయకులు ఎంఈఓ కార్యలయం ముందు ధర్నా, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. బేగార్లపల్లి గ్రామం నుంచి ర్యాలీగా అమరాపురం ప్రధాన రహదారికి చేరుకొని రోడ్డు పై భైఠాయించి ధర్నా నిర్వహించారు. అక్కడి నుండి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. పాఠశాల విలీనం వద్దు మా బడి మాకు ముద్దు అంటు నినాదాలు చేశారు. ఎంఈఓ కార్యలయం చేరుకొని అక్కడ  ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం పాఠశాల విలీనం కోసం తెచ్చిన జీవోను వెంనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. పాఠశాలల విలీనం వల్ల విద్యార్థులకు తీవ్రనష్టం జరుగుతుందన్నారు. తము పాఠశాల విలీనం ఎట్టి పరిస్థితిలో అంగీకరించమని విద్యార్థుల తల్లిదండ్రులు అన్నారు. వెంటనే విలీనం అపాలని డిమాండ్‌ చేశారు. ఎంఈఓ గోపాల్‌కు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో జిల్లా టిడీపీ ఎస్సీ సెల్‌ అధ్యక్షులు మంజునాథ్‌. జిల్లా బీసీసెల్‌ అధికార ప్రతినిధి నాగరాజు, నియోజకవర్గం ఉపాధ్యక్షులు రవి, టీఎనఎ్‌సఎ్‌ఫ అఽధ్యక్షులు రంగస్వామి, విద్యార్థి సంఘం నాయకులు ఉమే్‌షనాయక్‌ ఈశ్వర్‌. శ్రీనివా్‌సరెడ్డి తదితరులు పాలొన్నారు. 


Updated Date - 2022-07-07T05:34:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising