ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మా జీతాలిచ్చేందుకు డబ్బులు లేవా?

ABN, First Publish Date - 2022-07-06T06:29:33+05:30

పారిశుధ్య కార్మి కులు పదినెలలుగా జీతాలు అందక దుర్భర జీవనం గడుపుతున్నారు.

చెత్తతో సంపద తయారీ కేంద్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పారిశుధ్య కార్మికుల ఆవేదన

పదినెలలుగా అందని వైనం

దుర్భరంగా మారిన జీవనం

చోద్యం చూస్తున్న అధికారులు

 పట్టించుకోని పాలకులు

తనకల్లు, జూలై 5: సమాజం ఇంకా నిద్రలేవకనే పారిశుధ్య కార్మికుల (క్లాప్‌ మిత్ర ల) పని మొదలవుతుంది. ప్రజలు చెత్త, చెదారం, వ్యర్థపద్ధాలతో నింపిన రోడ్లను  శుభ్రం చేయడం వారి పని. ఇలా ప్రజల ఆ రోగ్యాన్ని కాడటంలో భాగస్వాములు అవుతు న్నారు. అయితే అటువంటి పారిశుధ్య కార్మి కులు  పదినెలలుగా జీతాలు అందక దుర్భర జీవనం గడుపుతున్నారు. అధికారులు చోద్యం చూస్తున్నారే తప్ప పాలకుల దృష్టకి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషిచేయలేదన్న అపవాదం మూటకట్టు కుంటున్నారు. పాలకులుకూడా పారిశుధ్య కార్మికుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. కదిరి నియోజకవర్గ వ్యాప్తంగా... తనకల్లు మండలంలో 56మంది, నంబులపూల కుంట 42, నల్లచెరువు 42, తలుపుల 42, గాండ్లపెంట 36మంది, కదిరి రూరల్‌ మం డలంలో 48మంది పారిశుధ్య కార్మికులు పనిచేస్తున్నారు. పదినెలలుగా వీరికి ప్రభుత్వం నుంచి రావాల్సిన జీతాలు రాకపోవడంతో ఆ కుటుంబాల జీవనం కష్టతరంగా మారింది. ఒక్కరోజు వారు తమ విధులను మాని వేస్తే రోడ్లన్నీ చెత్తచెదారంతో నిండి కంపుకొడుతాయి. చిరు ఉద్యోగులైన తమకు జీతాలివ్వడానికి ప్రభుత్వం వద్ద పైసలు లేవా అని పారిశుధ్య కార్మికుల కుటుంబాలు ప్రశ్నిస్తున్నాయి. తమ గోడును సాక్షాత్తు జిల్లా కలెక్టర్‌ బసంతకుమార్‌ దృష్టికి తీసుకెళ్లామని, త్వరలోనే చెల్లిస్తామని చెప్పారని వారంటున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి పారిశుధ్య కార్మికులకు వెంటనే జీతాలు చెల్లించాలని కోరుతున్నారు. 

ప్రభుత్వానికి నివేదికలు పంపాం - విజయ్‌కుమార్‌రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి

 జిల్లా వ్యాప్తంగా 1367మంది క్లాప్‌మిత్రలు పనిచేస్తున్నారు. వీరిలో వెయ్యి మందికి ప్రతి మూడు నెలలకు ఒకసారి జీతాలు సక్రమంగా ఖా తాల్లో జమ అవుతున్నాయి. 367మందికి వివిధ కారణాలతో జీతాలు జ మ కావడంలేదు. వాటన్నింటిని సరిచేసి ప్రభుత్వానికి (స్వచ్ఛభారత మిషనకు) నివేదికలు పంపాం. త్వరలోనే వారి ఖాతాల్లో జీతాలు జమ చేస్తాం. 


Updated Date - 2022-07-06T06:29:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising