ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ ఎన్ని కేసులు పెట్టినా బెదరం

ABN, First Publish Date - 2022-10-19T04:45:50+05:30

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై ఎన్ని కేసులు బనాయించినా భయపడరని, వాటిని ధైర్యంగా ఎదుర్కొంటా మని మాజీ మంత్రి పల్లెరఘునాథరెడ్డి వైసీపీని హెచ్చరించారు.

సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్న వైసీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

2024 ఎన్నికలే జగనకు చివరివి : మాజీ మంత్రి పల్లె

బుక్కపట్నం, అక్టోబరు 18: తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై ఎన్ని కేసులు బనాయించినా భయపడరని, వాటిని ధైర్యంగా ఎదుర్కొంటా మని మాజీ మంత్రి పల్లెరఘునాథరెడ్డి వైసీపీని హెచ్చరించారు.  బుక్కపట్నం మండలంలోని కొత్తకోట గ్రామంలో మంగళవారం దాదాపు 32 కుటుంబాల వారు వైసీపీ నుంచి పల్లె రఘునాథరెడ్డి సమక్షంలో టీడీపీ తీర్థంపుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వాల్మీకి మహర్షి విగ్రహం వద్ద ఏర్పాటుచేసిన సమావేశంలో మాజీ మంత్రి పల్లె మాట్లాడుతూ... వైసీపీ ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా టీడీపీ నాయకులు, కార్యకర్తలు బెదరమని అన్నారు. కార్యకర్తలను కాపాడు కునేందుకు వారికి రక్షణగా నిలిచేందుకు తాను జైలుకు సిద్దమేన న్నారు. వైసీపీ తాటాకు చప్పుళ్లకు టీడీపీ కార్యకర్తలు భయపడరన్నా రు.  కష్టాల్లో ఉన్న టీడీపీకి అండగానిలిచి కేసులు ఎదుర్కొన్న కార్యక ర్తల త్యాగాలు వృథాకావన్నారు. 2024 ఎన్నికలే జగనకు చివరి ఎన్నికలు కానున్నాయని పల్లె జోస్యం చెప్పారు. రాజధాని అమరావతి కోసం పాదయాత్ర చేస్తున్న రైతులను ఆడ్డుకుంటే జగనరెడ్డి ప్రభుత్వానికి నూకలు చెల్లినట్టే అని ఆయన హెచ్చరించారు. కొత్తకోట గ్రామం టీడీపీ కంచుకోటగా మారిందన్నారు. ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన పల్లెకు టీడీపీ కార్యకర్తలు భారీ ఊరేగింపు నిర్వహిస్తూ ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్‌ చింతా మల్లిరెడ్డి, నాయకులు సుబ్బారెడ్డి, సామకోటి ఆదినారాయణ, గంగాధర్‌, బాలు, లావణ్య పాల్గొన్నారు.



Updated Date - 2022-10-19T04:45:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising