ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజలకు మెరుగైన సేవలందించాలి: కలెక్టర్‌

ABN, First Publish Date - 2022-05-19T05:52:06+05:30

గ్రామ సచివాలయాలకు వచ్చే ప్రజలకు మెరుగైన సేవాలందించాలని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి పేర్కొన్నారు. బుధవారం మండలంలోని ఇటుకలపల్లి, ఆకుతోటపల్లి, పూలకుంట, చియ్యేడు గ్రామాల్లో పర్యటించారు.

ఉపాధి కూలీలతో మాట్లాడుతున్న కలెక్టర్‌ నాగలక్ష్మి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం రూరల్‌, మే 18: గ్రామ సచివాలయాలకు వచ్చే ప్రజలకు మెరుగైన సేవాలందించాలని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి పేర్కొన్నారు. బుధవారం మండలంలోని ఇటుకలపల్లి, ఆకుతోటపల్లి, పూలకుంట, చియ్యేడు గ్రామాల్లో పర్యటించారు. ఇటుకలపల్లి గ్రామంలో ఉపాధి పనులను పరిశీలించారు. కూలీలతో మాట్లాడారు. ఎన్ని గంటలకు పనికొస్తున్నారు. ఎన్ని గంటల వరకు పనులు చేస్తున్నారు. తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. కూలీ పనులకు సంబంధించిన బిల్లులు రెండు, మూడు రోజుల్లో పడతాయని ఆమె తెలిపారు. ఈసందర్భంగా కూలీలు పనిముట్లు అందించాలని కోరారు. అనంతరం ఆకుతోటపల్లిలో చెత్తతో సంపద సృష్టి కేంద్రాన్ని సంద ర్శించి స్థానిక సర్పంచు, అధికారులతో వివరాలు ఆరా తీశారు. అక్కడి నుంచి చియ్యేడు, పూలకుంట సచివాల యాలను తనిఖీ చేశారు. ఉద్యోగులు ఉదయం 10గంటలకు సచివాలయంలో ఉండాలన్నారు. అంగనవాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు.  కార్యక్రమంలో డ్వామా పీడీ వేణుగోపాల్‌రెడ్డి, డీపీఓ శివశంకర్‌, తహసీల్దార్‌ మోహనకుమార్‌, ఏఓ వెంకటాచలపతి, ఏపీఓ ఎర్రమ్మ, మండల పీఆర్‌ ఇంజనీర్‌ శ్రీనివాసరెడ్డి, టెక్నికల్‌ అసిస్టెంట్లు వెంకటరామిరెడ్డి, హేమాక్షి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-19T05:52:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising