ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు వేయొద్దన్నారని..

ABN, First Publish Date - 2022-12-16T00:06:42+05:30

గ్రామానికి రోడ్డు వేయొద్దన్నారని పాఠశాల, అంగనవాడీ కేంద్రానికి ఆ ఊరివారు తాళం వేసి, నిరసన తెలిపారు. తాగునీటి బోరు మోటారుకు విద్యుత కనెక్షన తొలగించారు. మండలంలోని కాయలవాండ్లపల్లిలో గురువారం నిరసన తెలిపారు.

పాఠశాలకు తాళం వేసిన దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాఠశాల, అంగనవాడీ కేంద్రానికి తాళం

తాగునీటి బోరు మోటారు కనెక్షన తొలగింపు

కాయలవాండ్లపల్లి వాసుల నిరసన

నల్లమాడ, డిసెంబరు 15: గ్రామానికి రోడ్డు వేయొద్దన్నారని పాఠశాల, అంగనవాడీ కేంద్రానికి ఆ ఊరివారు తాళం వేసి, నిరసన తెలిపారు. తాగునీటి బోరు మోటారుకు విద్యుత కనెక్షన తొలగించారు. మండలంలోని కాయలవాండ్లపల్లిలో గురువారం నిరసన తెలిపారు. బొగ్గిటివారిపల్లి క్వార్టర్స్‌ నుంచి కాయలవాండ్లపల్లికి రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. కొన్నిరోజుల క్రితం ముళ్ల కంపలను తొలగించారు. ఇందులో అదే గ్రామానికి చెందిన ఇద్దరు రైతులు తమ పొలాల మీదుగా రోడ్డు వేయరాదని అడ్డుకున్నారు. దీంతో గ్రామస్థులు రోడ్డు అవసరం లేనపుడు పాఠశాల, అంగనవాడీ కేంద్రం ఎందుకంటూ గురువారం పిల్లలను బయటకు పంపి, తాళాలు వేశారు. తాగునీటి బోరు మోటారుకు విద్యుత కనెక్షన తొలగించారు. గ్రామానికి 50 ఏళ్లుగా రోడ్డు లేక ఇబ్బందులు పడుతున్నామని ఊరిజనం ఆవేదన చెందారు. గతంలో కూడా రెండుమార్లు రోడ్డు మంజూరైతే, అప్పట్లో కొంతమంది రైతులు అడ్డుకోవడంతో నిధులు వెనక్కు వెళ్లాయన్నారు. ప్రస్తుతం బొగ్గిటివారిపల్లి క్వార్టర్స్‌ నుంచి కాయలవాండ్లపల్లికి రోడ్డు మంజూరైందన్నారు. పనులను రైతులు అడ్డుకున్నారు. దీంతో పాఠశాల, అంగనవాడీ కేంద్రానికి తాళాలు వేశారు. విషయం తెలుసుకున్న ఏఎ్‌సఐ సురేంద్ర, హెడ్‌కానిస్టేబుల్‌ రమణ కాయలవాండ్లపల్లికి వెళ్లి, గ్రామస్థులతో చర్చించారు. పాఠశాల, అంగనవాడీ కేంద్రానికి తాళం వేయడం, తాగునీటి మోటారుకు విద్యుత కనెక్షన తొలగించడం సరికాదని సూచించారు. రోడ్డు పనుల సమస్యను తహసీల్దార్‌తో మాట్లాడి, పరిష్కరిస్తామని చెప్పడంతో గ్రామస్థులు పాఠశాల, అంగనవాడీ కేంద్రానికి వేసిన తాళాలు తీయించారు.

Updated Date - 2022-12-16T00:06:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising