ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైవేపై ఎమ్మార్పీఎస్‌ నాయకుల రాస్తారోకో

ABN, First Publish Date - 2022-07-03T06:03:14+05:30

కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణపై నిర్లక్ష్యం వహిస్తూ మాదిగలకు అన్యాయం చేస్తోందంటూ ఎమ్మార్పీఎస్‌ మండల నాయకులు శనివారం జాతీయ రహ దారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వ హించారు.

నల్లచెరువు వద్ద జాతీయ రహదారిపై బైఠాయించిన ఎమ్మార్పీఎస్‌ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50




నల్లచెరువు, జూలై 2: కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణపై నిర్లక్ష్యం వహిస్తూ మాదిగలకు అన్యాయం చేస్తోందంటూ ఎమ్మార్పీఎస్‌ మండల నాయకులు శనివారం జాతీయ రహ దారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వ హించారు. జిల్లా కన్వీనర్‌ సామ్రాట్‌ కే మధు,  సత్యసాయి జిల్లా అధ్యక్షుడు పలక ఆంజనేయులు ఆధ్వర్యంలో ఈ సడక్‌ బంద్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకులు మందక్రిష్ణ మాదిగ తలపెట్టిన సడక్‌ బంద్‌లో భాగంగా రాష్ట్ర అధ్యక్షుడు రుద్రపోగు సురేష్‌ మాదిగ ఆదేశానుసారం రాస్తాకో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  నేడు హైదరాబాద్‌లో జరిగే మాదిగల మహాగర్జనను విజయవంతం చేయాలని కోరారు. రాస్తారోకో చేస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేసి, స్టేషనకు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఎమ్మార్పీఎస్‌ నాయకులు ఉబిచెర్ల రమణ, వెంకటస్వామి, బొమ్మిరెడ్డిపల్లి రవి, జయసుధ, రా మాంజి, శ్రీరాములు, శివ, నాగేంద్ర, ఆంజనప్ప, ఉమాశంకర్‌ తదితరులున్నారు. 

 ముందస్తు నోటీసులు

ధర్మవరం: వర్గీకణ చేపట్టాలంటూ జాతీయ రహదారి దిగ్బంధం కార్యక్ర మానికి వెళ్లకుంండా ఎమ్మార్పీఎస్‌ నాయకులకు అర్బన సీఐ సుబ్రహ్మణ్యం శనివారం ముందస్తు నోటీసులు అందజేశారు. నాయకులు కేశగాళ్ల వెంకటేశ, కేశగాళ్ల శ్రీనివాసులు, రేగాటిపల్లి వరదరాజులు, కుళ్లాయప్ప తదితరులను సీఐ పోలీస్‌స్టేషనకు పిలిపించి జాతీయ రహదారి దిగ్బంధానికి వెళ్లకూడదని నోటీసులు అందజేశారు.

ముందస్తు అరెస్టులు

కొత్తచెరువు:  మందక్రిష్ణ మాదిగ పిలుపు మేరకు  జాతీ య రహదారి దిగ్బంధానికి వెళ్తున్న ఎమ్మార్పీ ఎస్‌ మం డల నాయకులను  పోలీసులు శనివారం అరెస్టు చేసి పోలీస్‌స్టేషనకు తరలించారు.  అరెస్టు అయిన వారిలో ఎమ్మార్పీఎస్‌ నాయకులు సాయిప్రసాద్‌, బండ్లపల్లి నరసింహులు, వెంకటరాముడు, వంశీ, నరసింహమూర్తి, రామయ్య, గంగాధర్‌ ఉన్నారు.

తనకల్లు: ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో తలపెట్టిన సడక్‌ బంద్‌ను నిర్వహించకుండా శనివారం స్థానిక నాయకులను ఎస్‌ఐ రాంభూపాల్‌ ఆధ్వర్యంలో ఉదయం 6 గంటలకే ముందస్తుగా అరెస్టు చేశారు. వివిధ గ్రామాలకు చెందిన ఎమ్మార్పీఎస్‌ నాయకులను స్టేషనకు తీసుకొచ్చి, బంద్‌ చేయకూడదని తెలియచేసి, సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ కార్య క్రమంలో ఎమ్మార్పీఎస్‌ నాయకులు పారేసు, సత్యనారాయణ, ఎండీ నరసింహు లు, కిష్టప్ప, చంద్రప్ప, మండల కన్వీనర్‌ నరసింహులు తదితరులున్నారు. 

Updated Date - 2022-07-03T06:03:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising