ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మైనార్టీల సంక్షేమ పథకాలు అమలుచేయాలి

ABN, First Publish Date - 2022-07-05T05:16:19+05:30

ముఖ్యమంత్రి జగనమోహనరెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం మైనార్టీలకు సంక్షేమ పథకాలను అమలు చేయాలని తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి మహ్మద్‌రఫీ డిమాండు చేశారు.

వినతిపత్రం అందజేస్తున్న టీడీపీ మైనార్టీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


కలెక్టర్‌కు టీడీపీ మైనార్టీ సెల్‌ నాయకుల వినతి

పుట్టపర్తిరూరల్‌, జూలై 4: ముఖ్యమంత్రి జగనమోహనరెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం మైనార్టీలకు సంక్షేమ పథకాలను అమలు చేయాలని తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి మహ్మద్‌రఫీ డిమాండు చేశారు. ఈ మేరకు ఆయన ఆధ్వర్యంలో పలువురు ముస్లిం మైనార్టీఉ సోమవారం జిల్లా కలెక్టర్‌ బసంతకుమార్‌ వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. మైనార్టీలకు పెళ్లికానుకగా గత ప్రభుత్వం దుల్హన పథకం కింద రూ. 50వేలు ఇస్తుంటే అది చాలదని తాము అధికారంలోకి వస్తే రూ. లక్ష ఇస్తామని చెప్పిన జగనరెడ్డి మాట తప్పి మొత్తానికే పథకాన్ని రద్దుచేశారన్నారు. అలాగే రంజానతోఫా, మైనార్టీల పిల్లల విదేశీ విద్యకు అందజేస్తున్న 10లక్షల ఆర్థిక సాయం నిలిపివేశారన్నారు. హజ్‌హౌస్‌ల నిర్మాణాలను నిలిపివేసి మైనార్టీలను నిండా మోసం చేశారని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మైనార్టీలకు ఇచ్చిన హామీమేరకు సంక్షేమపథకాలను అమలుచేయాలని లేనిపక్షంలో ఉద్యమాలు తప్పవని హెచ్చ రించారు. సమస్యలను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్ళగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని ఆయన హామీ ఇచ్చారన్నారు. కార్యక్రమంలో టీడీపీ మైనార్టీ సెల్‌ విభాగం రాష్ట్ర కార్యవర్గసభ్యులు డైమండ్‌బాబా, జిల్లా కార్యవర ్గసభ్యులు అత్తార్‌ఖాదిర్‌, పట్టణ అధ్యక్షుడు యాసిన, నాయకులు అజ్మతుల్లా, కొత్తచెరువు షబ్బీర్‌, అత్తార్‌ఖాదర్‌బాషా తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-07-05T05:16:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising