ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి ’ ప్రణాళికపై సమావేశం

ABN, First Publish Date - 2022-12-04T23:48:43+05:30

ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్య క్రమం నిర్వహణపై ఆదివారం టీడీపీ స్థానిక కార్యాలయంలో సమావే శం నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గాండ్లపెంట, డిసెంబరు 4: ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్య క్రమం నిర్వహణపై ఆదివారం టీడీపీ స్థానిక కార్యాలయంలో సమావే శం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర మహిళా కమిషన మాజీ సభ్యురాలు పర్వీనభాను, నర్సిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై మోపుతున్న భారంపై మండలం లో ఇంటింటికి తీసుకెళ్లి వివరించాలన్నారు. గతంలో కంటే రాష్ట్రాభివృద్ధి 20 సంవత్సరాలు వెనుక్కు వెళ్లిందన్నారు. ఇచ్చేది గోరంత, ప్రజలనుంచి తీసుకునేది కొండత అన్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నిర్వహించ తలపెట్టిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్ర మాన్ని మండలంలో ఈ నెల 7నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈసమావేశంలో మండల కన్వీనర్‌ కొండయ్య, రోషన, మాజీ ఎంపీపీ గంగరాజు, ఎంపీటీసీ జయరామక్రిష్ణారెడ్డి, మాజీ సర్పంచ ప్రసాద్‌, ఉపాధ్యక్షులు తాజుద్దీన, రఫీ, తెలుగుయువత కార్యకర్తలు, రమేష్‌, దాదాపీర్‌, పవన, ఆంజినాయక్‌, ఉమ్మర్‌అలీ, బాబు, కాశిరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నంబులపూలకుంట: తెలుగుదేశం పార్టీ చేపట్టిన ఇదేం ఖర్మ మనరాష్ట్రానికి కార్యక్రమం నిర్వహణపై ఆదివారం స్థానిక మండల క్లస్టర్‌ ఇనచార్జ్‌ దండే రవి నివాసంలో నాయకులు సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా నియోజకవర్గ నుంచి మండల అబ్జర్వర్‌గా కాటం మనోజ్‌, గంగయ్యయాదవ్‌ హాజరై మాట్లాడుతూ... మండల వ్యాప్తంగా 14 పంచాయతీలతో పాటు ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికెళ్లి సమస్యలు తెలుసుకునేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. దానిపై చర్చించా రు. తెలుగుదేశం బూత, గ్రామ కమిటీల ద్వారా ప్రత్యేక సమావేశం నిర్వహించి, కార్యాచరణపై వివరించారు. టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్‌ కందికుంట వెంకటప్రసాద్‌ గ్రామంలో పర్యటించినప్పుడు ప్రజలే సమ స్యలను ఆయన దృష్టికి తెచ్చేలా అవగాహన కల్పించాలన్నారు. అనంత రం ఇదేం ఖర్మ పోస్టర్లను విడుదలచేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్‌ చంద్రశేఖర్‌నాయుడు, ప్రధాన కార్యదర్శి నరసింహులు, మాజీ ఎంపీటీసీ రామాంజులు, మాజీ సర్పంచ శ్రీరాములనాయుడు, పాలగిరి రాహూల్‌, నరసింహారెడ్డి, అజంతుల్లా, హనుమంతరెడ్డి, భద్రయ్య, వెంకటరమణ, బషీర్‌ తదితరులున్నారు.

Updated Date - 2022-12-04T23:48:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising