మట్కా డాన అరెస్ట్
ABN, First Publish Date - 2022-01-11T06:01:07+05:30
అంతర్రాష్ట్ర మట్కా డానగా పేరుగాంచిన బాబాజాన (చికెన బాబా)తోపాటు మరో ముగ్గురు బీటర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం స్థానిక సర్కిల్ కార్యాలయంలో సీఐ హమీద్‌ఖాన అరెస్టు వివరాలను విలేకరులకు వెల్లడించారు.
ముగ్గురు బీటర్లు కూడా.. రూ.11.50 లక్షల నగదు,
ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్లు స్వాధీనం
హిందూపురం టౌన, జనవరి 10: అంతర్రాష్ట్ర మట్కా డానగా పేరుగాంచిన బాబాజాన (చికెన బాబా)తోపాటు మరో ముగ్గురు బీటర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం స్థానిక సర్కిల్ కార్యాలయంలో సీఐ హమీద్‌ఖాన అరెస్టు వివరాలను విలేకరులకు వెల్లడించారు. హిందూపురంలో మట్కాడానగా ఎదిగిన చికెనబాబాతో పాటు అహ్మద్‌నగర్‌కు చెందిన షాకీర్, పరిగి మండలానికి చెందిన చిన్నమ్మ వడసలప్పగారి నరసింహప్ప, తాడిపత్రికి చెందిన దావూద్ ఇబ్రహీంలు గత కొంతకాలంగా మట్కా రాస్తూ పేదల సొమ్ము దోచుకుంటున్నారు. ఎస్పీ సీరియ్‌సగా పరిగణించి పెనుకొండ డీ ఎస్పీ రమ్య ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలతో వారిపై నిఘా పెట్టా రు. ఈక్రమంలో ఉదయం చిలమత్తూరు మండలం రక్షా అకాడమీ సమీపంలో ముళ్లపొదల వద్ద మట్కా పట్టీలు రాస్తుండగా దా డిచేసి నలుగురిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.11.50 లక్షల నగదు, రెండు ల్యాప్‌టా్‌పలు, సెల్‌ఫోన్లు, మట్కా పట్టీలు స్వాధీనం చేసుకున్నారు. మట్కా గుట్టును ఛేదించిన సీఐ హమీద్‌ఖాన, ఎస్‌ఐలు మునీర్‌అహ్మద్, రంగడును ఉన్నతాధికారులు అభినందించారు. సమావేశంలో సి బ్బంది రవికుమార్, చెన్నకేశవులు, మంజునాథ్, వేణుగోపాల్ పాల్గొన్నారు.
Updated Date - 2022-01-11T06:01:07+05:30 IST