ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బైకులు ఢీ.. వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2022-08-15T05:22:45+05:30

మండల పరిధి పులగంపల్లి క్రాస్‌లోని దొన్నికోట మలు పు వద్ద రెండు ద్విచక్రవాహనాలు ఆదివారం ఢీకొనడంతో గోరంట్ల మండలం వానవోలు సమీపంలోని ముత్తురాయుని తండాకు చెందిన శంకర్‌నాయక్‌ (30) మరణించాడు.

శంకర్‌నాయక్‌ (ఫైల్‌ )
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లమాడ, ఆగస్టు 14 : మండల పరిధి పులగంపల్లి క్రాస్‌లోని దొన్నికోట మలు పు వద్ద రెండు ద్విచక్రవాహనాలు ఆదివారం ఢీకొనడంతో గోరంట్ల మండలం వానవోలు సమీపంలోని ముత్తురాయుని తండాకు చెందిన శంకర్‌నాయక్‌ (30) మరణించాడు. శంకర్‌నాయక్‌ తన భార్య  గీతాబాయి, కుమారై మోక్షితతో కలిసి ద్విచక్రవాహనంలో కదిరికి బయలుదేరాడు. అమడగూరు మండలం మహమ్మదాబాద్‌కు చెందిన అంజనప్ప కదిరి నుంచి బుక్కపట్నంకు బైక్‌లో బయలుదేరాడు. వీరి బైక్‌లు పులగంపల్లి క్రాస్‌లోని దొన్నికోట సమీపంలో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో శంకర్‌నాయక్‌, గీతాబాయి, మోక్షిత గాయపడ్డారు. ఆంజనప్పకు ఒక కాలు విరిగింది. 108 వాహనంలో వారిని కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా శంకర్‌నాయక్‌ మార్గమధ్యలోనే మరణించాడు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం అంజనప్పకు మెరుగైన వైద్యం కోసం అనంతపురం,  గీతాబాయి, మోక్షితలను బత్తలపల్లి ఆర్‌డీటీ ఆసుపత్రికి తరలించారు. అంజనప్ప అమడగూరులోని మోడల్‌ పాఠశాలలో అటెండర్‌గా పనిచేస్తున్నాడు. శంకర్‌నాయక్‌ కూలి పనులు చేసుకుని కుటుంబాన్ని పోషించేవాడు.  మోక్షితకు జ్వరం రావడంతో చికిత్స నిత్తం కదిరికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని గీతాబాయి ఎస్‌ఐ వలీబాషాకు వివరించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. శంకర్‌నాయక్‌కు ముగ్గురు కుమారైలు ఉన్నారు.

ముత్తరాయన తండాలో విషాదం 

గోరంట్ల : రోడ్డు ప్రమాదంలో శంకర్‌నాయక్‌ మృతి చెందడంతో ఆయన స్వస్థలమైన గోరంట్ల మండలం ముత్తరాయనతండాలో విషాదఛాయలు అమలు కొన్నాయి. శంకర్‌నాయక్‌ వ్యవసాయ కూలీ. ఆయనకు భార్య గీతాబాయి, కుమార్తెలు మోక్షిత (3వ తరగతి), మైథిలి (1వ తరగతి), లాస్య (అంగనవాడీ సెంటర్‌లో విద్యార్థి) ఉన్నారు. కదిరి సమీపంలోని అత్తగారి ఊరైన తుమ్మల తండాకు వెళ్లారు. ఆదివారం జరిగిన ప్రమాదంలో  శంకర్‌నాయక్‌ మరణించాడు. కుటుంబానికి పెద్ద దిక్కయిన శంకర్‌నాయక్‌ మృతిచెందడంతో భార్య, ముగ్గురు కుమార్తెలు దిక్కులేనివారయ్యారు.

Updated Date - 2022-08-15T05:22:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising