ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెరువులను తలపిస్తున్న ప్రధాన వీధులు

ABN, First Publish Date - 2022-10-07T05:04:34+05:30

మండలంలో బుధవారం రాత్రి కురిసిన వర్షాలకు ప్రధాన రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి.

ఎన్పీకుంటలో కొత్తరోడ్డు సమీపంలోనిల్వ ఉన్న వర్షపునీరు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


అమడగూరు, అక్టోబరు 6: మండలంలో బుధవారం రాత్రి కురిసిన వర్షాలకు ప్రధాన రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ప్రధా నంగా స్థానిక చౌడేశ్వరీ పాఠశాల వీధి, బస్టాండ్‌లోని ప్రధాన రహ దారి, చౌడేశ్వరీ ఆలయం వద్ద, మహమ్మదాబాద్‌లోని వీధులన్నీ, మల కవారిపల్లి, చిన్నగానిపల్లి, తనకంటివారిపల్లి, కందుకూరివారపల్లి, కొత్తపల్లిల్లో వీధులన్నీ నీటి మయమయ్యాయి వర్షం నీటికి తోడు మురుగునీరు  రోడ్డుపైకి చేరడంతో పాదాచారులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మురుగునీటిలోని నడుచుకుంటూ ఇళ్ల లోకి వెళ్లాల్సిన దుస్థితి నెలకొందన్నారు. అధికారులు, ప్రజాప్రతిని ధులకు పలుమార్లు విన్నవించినా, పట్టించుకోవడంలేదని ఆవేదన చెందారు. నీరు నిలువ ఉండడంతో దోమలు పెరిగి అనారోగ్యం బారిన పడుతున్నట్లు గ్రామస్తులంటున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి గ్రామాల్లో సీసీరోడ్లు వేయాలని కోరుతున్నారు. 

నంబులపూలకుంట: మండల వ్యాప్తంగా బుధవారం రాత్రి నుంచి గురువారం సాయంత్రం వరకు ఓ మోస్తారు వర్షం కుసింది. 21.2 మిలిమీటర్లు వర్షం నమోదైనట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. కదిరి, రాయచోటి ప్రధాన రహదారి పనులు జరుగుతుండడంతో, కొత్తరోడ్డు సమీపంలో నిర్మించిన బ్రిడ్జి వద్ద, నాలుగురోడ్ల కూడలిలో నీరు పోవడానికి వీలేకపోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  అలాగే తూర్పునడింపల్లి గ్రామం నడి ఒడ్డున నీరు నిలువ ఉండడంతో నివాసులు, టీఎన కొత్తపల్లి దారిగుండా వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 


Updated Date - 2022-10-07T05:04:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising