ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాధవ్‌.. మాటలు జాగ్రత్త

ABN, First Publish Date - 2022-08-13T06:06:57+05:30

గోరంట్ల మాధవ్‌... ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలంటూ అనంతపురం అర్బన మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి హెచ్చరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కులాన్ని అడ్డుపెట్టుకొని 

రాజకీయం చేయొద్దు 

మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి

అనంతపురం అర్బన,  ఆగస్టు 12: గోరంట్ల మాధవ్‌... ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలంటూ అనంతపురం అర్బన మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి హెచ్చరించారు. శుక్రవారం సాయంత్రం అనంతపురం అర్బన టీడీపీ కా ర్యాల యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సభ్య సమాజం తలదించుకునేలా మాధవ్‌ చేష్టలు ఉన్నాయని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. గత కొన్ని రోజులుగా కలుషిత వాతావరణం చూసి ఎందుకు ఈ రాష్ట్రంలో ఉన్నా మంటూ సిగ్గు పడాల్సి వస్తోందన్నారు. జిల్లా ఎస్పీ ప్రకటన తర్వాత ఎంపీ హోదాలో హుందాగా వ్యవహరించాల్సిన మాధవ్‌ అందుకు భిన్నంగా చంద్రబాబునాయుడు, నారా లోకేష్‌, మీడియా ప్రతినిధులపై సంస్కారహీనంగా మా ట్లాడటం దారుణ మన్నారు. కులాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయం చేయాలని చూడటం సరికాదన్నారు. వ్యక్తిగతంగా ఎదగలేని శక్తి లేని వారే కులాలు, మతాలను అడ్డుపెట్టుకొని లబ్ధి పొందాలని చూస్తారన్నారు. టీడీపీ హయాంలో తాను ఎమ్మెల్యేగా పనిచేసిన సమ యంలో గోరంట్ల మాధవ్‌ను ఆ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బాగా పనిచే స్తాడన్న ఉద్దేశ్యంతో అనంతపురం టౌనలో పోలీసు అధికారిగా విధులు నిర్వర్తిం చేందుకు సహకరించామన్నారు. తాను అన్నికులాల వారిని ప్రోత్సహించేలా ముం దుకు వెళ్లానని గుర్తు చేశారు. ఖాకీ నుంచి ఖద్దర్‌ వేసుకున్న తర్వాత మరింత బాధ్య తగా వ్యవహరించాల్సిన మాధవ్‌ అసభ్యకరంగా, నిర్లజ్జగా వ్యవహ రించడం దుర దృష్టకరమన్నారు. గతాన్ని గుర్తు పెట్టుకొని మాధవ్‌ ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడా లని, వీధి రౌడీలా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. 

Updated Date - 2022-08-13T06:06:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising