ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సహనం కోల్పోయి... పవనపై నోరుపారేసుకుంటున్న సీఎం

ABN, First Publish Date - 2022-11-24T00:01:16+05:30

రాష్ట్రం లో ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుండటం తో సహనం కోల్పోయి మా అధినేత పవనపై సీఎం జగన నోరుపారేసుకుం టున్నారని జనసేనపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదనరెడ్డి మం డిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జనసేనపార్టీని రౌడీసేన అనడం జగనకు తగదు : చిలకం

ధర్మవరం, నవంబరు 23: రాష్ట్రం లో ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుండటం తో సహనం కోల్పోయి మా అధినేత పవనపై సీఎం జగన నోరుపారేసుకుం టున్నారని జనసేనపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదనరెడ్డి మం డిపడ్డారు. ఆయన బుధవారం సాయం త్రం పట్టణంలోని తన స్వగృహంలో ఏ ర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. ప్రజలలో తనకు ఎందుకిం త వ్యతిరేకత వస్తోందో తెలుసుకోకుండా సహనం కోల్పోయి ఇటీవల ముఖ్యమంత్రి వైస్‌జగన జనసేనపార్టీ అధినేత, ప్రతి పక్షాలపై అథికంగా విమర్శలు చేయడం పద్ధతి కాదన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి చే యలేకపోవడంతోనే వ్యతిరేకత వస్తోందన్నారు. అలాగే మా పార్టీని రౌడీసేన అని విమర్శించడం జగనకు తగదన్నారు. రాష్ట్రంలో రౌడీయిజం, దందాలు, అక్రమాలు, దౌర్జన్యాలు చేస్తుంది ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. కౌలు రైతులకు భరోసా ఇచ్చి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చేయడం, కరోనా కాలంలో జనసేన నాయకులు, కార్యకర్తలు సేవా కార్యక్రమాలు చేయడం వంటివి చూసి రౌడీసేన అంటారా అని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో రోడ్లన్నీ గుంతలమయంగా మా రడంతో, వాటిని సోషల్‌ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేశామన్నారు. జగనన్న కాలనీల్లో అక్రమాలు, అవినీతిని ఎత్తిచూపామనే ఆరోపణలు చేస్తున్నారన్నారు. పరిపాలన చేతకాకపోతే మంచి సలహాదారుడిని పెట్టుకోవాలని, అబద్ధాలు మాను కుని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం నేర్చుకోవాలన్నారు. మైనార్టీలకు కల్లబొల్లి మా టలు చెప్పి వారి ఓట్లు వేయించుకుని వారి పథకాలన్నీ రద్దుచేశారన్నారు. సీఎంసభలో నిరసన తెలియజేసేందుకు వస్తారేమో అనే అనుమానంతో మహిళల చున్నీలను పోలీసులచేత బలవంతంగా తీయించడమే సీఎం జగన మహిళలకు ఇచ్చే గౌరవం ఏపాటిదో తెలుపుతోందన్నారు. ఇకనైనా స్థాయి దిగజారి మాట్లాడవద్దని సీఎంజగనకు చిలకం హితవుపలికారు.

Updated Date - 2022-11-24T00:01:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising