ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ బస్సు యాత్రను అడ్డుకుంటాం

ABN, First Publish Date - 2022-05-25T06:26:16+05:30

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన 56 కార్పొరేషన్లకు వెంటనే నిధులు కేటాయిం చాలని, లేకుంటే ఈ నెల 29న సత్యసాయి జిల్లాకు చేరే బీసీ మంత్రులు బస్సుయాత్రకు అడ్డుకొంటామని రాష్ట్ర బీసీ జేఏసీ నాయకులు హెచ్చరించారు.

పుట్టపర్తిలో మాట్లాడుతున్న రాష్ట్ర బీసీ జేఏసీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కార్పొరేషన్లకు నిధులు కేటాయించాల్సిందే: జేఏసీ

పుట్టపర్తి, మే 24 : ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన 56 కార్పొరేషన్లకు వెంటనే నిధులు కేటాయిం చాలని, లేకుంటే ఈ నెల 29న సత్యసాయి జిల్లాకు చేరే  బీసీ మంత్రులు బస్సుయాత్రకు అడ్డుకొంటామని  రాష్ట్ర బీసీ జేఏసీ నాయకులు హెచ్చరించారు. మంగళవారం పుట్టపర్తిలోని ఓ రెస్టారెంట్‌లో జేఏసీ నాయకులు బోరంపల్లి ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి మందాకృష్ణయ్య, నాయకులు మాజీ మున్సిపల్‌ చైర్మన పీసీ గంగన్న మాట్లాడారు. ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ, బీసీ కార్పొరేషన్లను విడగొట్టి వైసీపీ ప్రభుత్వం 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేసిందని, అయితే ఈ కార్పొరేషన్లకు రెండేళ్ళు అవుతున్నా నిధులు కేటాయించలేదని అన్నారు. రాష్ట్ర బడ్జెట్‌ 2.50 లక్షల కోట్లు పైనే ఉందని, రాష్ట్రంలో 85 శాతమున్న తమకు కనీసం అందులో 56 వేల కోట్లు కూడా కేటాయించక పోవడం దారుణమని అన్నారు. దీనిపై బీసీ వర్గాలకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా నోరు మెదపడంలేదని మండిపడ్డారు. సమావేశంలో ఎంఆర్‌పీస్‌, నాయకులు తంబయ్య, బాలరాజు, వాల్మీకి సంఘనాయకులు లక్ష్మీనారాయణ, పుట్లగంగాద్రి, పెద్దన్న, వడ్డెర సంఘం నాయకులు తిరుపతేంద్ర, కురుబ సంఘ నాయకులు రవి, రజక సంఘం నాయకులు శంకర్‌, నాయూబ్రాహ్మణ సంఘం నాయకులు శ్రీనివాసులు, నాగరాజు, మైనారిటీ నాయకులు నిసార్‌ అహ్మద్‌ పాల్గొన్నారు.

 

Updated Date - 2022-05-25T06:26:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising