ఇంధన పొదుపునకు కట్టుబడి ఉందాం : డీఆర్‌ఎం
ABN, First Publish Date - 2022-12-16T23:46:13+05:30
రైల్వే కార్యాలయాలు, కాలనీలలో ఉద్యోగులందరూ విద్యుత ఇంధన పొదుపు చర్యలు చేపట్టాలని డీఆర్‌ఎం వెంకట రమణారెడ్డి పేర్కొన్నారు.
గుంతకల్లు/గుంతకల్లు టౌన, డిసెంబరు 16: రైల్వే కార్యాలయాలు, కాలనీలలో ఉద్యోగులందరూ విద్యుత ఇంధన పొదుపు చర్యలు చేపట్టాలని డీఆర్‌ఎం వెంకట రమణారెడ్డి పేర్కొన్నారు. ఎనర్జీ కంజర్వేషన వీక్ సెలెబ్రేషన్సలో భాగంగా శుక్రవారం ఉదయం స్థానిక డీఆర్‌ఎం కార్యాలయంలో ఇంధన పొదుపుపై ప్రతిజ్ఞా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్‌ఎం రైల్వే సిబ్బందిచేత ప్రతిజ్ఞచేయించారు. డీఆర్‌ఎం మాట్టాడుతూ విద్యుత్తు పొదుపు విషయంగా దేశస్థాయిలో గుంతకల్లు రైల్వే స్టేషనకు రెండవ స్థానం దక్కిందన్నారు. సిబ్బంది సహకారం వల్లే ఇది సాధ్యపడిందన్నారు.
ఎస్కలేటర్లు ఏర్పాటుచేయాలని వినతి : అనంతపురం, ధర్మవరం రైల్వే స్టేషన్లలో ఎస్కలేటర్లను ఏర్పాటు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డి.జగదీష్ డీఆర్‌ఎం వెంకటరామి రెడ్డికి వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా అనంతపురం, ధర్మవరంలో ఫ్లాట్‌ఫాం సంఖ్య పెంచి రద్దయిన రైళ్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు గోవిందు, పట్టణ కార్యదర్శి గోపినాథ్, రాము, దేవేంద్ర, మురళి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-16T23:46:14+05:30 IST