దోపిడీ పాలనను అంతమొందిద్దాం
ABN, First Publish Date - 2022-12-16T00:07:57+05:30
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మూడు న్నరేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలు దోపిడీకు గురవుతున్నారని మాజీమంత్రి, టీడీపీ పార్టీ రాష్ట్ర పొలిట్‌బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు విమర్శించారు.
మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు
రాయదుర్గంటౌన్, డిసెంబరు 15: ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మూడు న్నరేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలు దోపిడీకు గురవుతున్నారని మాజీమంత్రి, టీడీపీ పార్టీ రాష్ట్ర పొలిట్‌బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు విమర్శించారు. పట్టణంలోని వినాయక సర్కిల్లో గురువారం అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల లు వేసి ఘన నివాళుల ర్పించారు. అనంతరం ఇదేమి ఖర్మ కార్యక్ర మంలో పాల్గొన్నారు. పట్టణంలోని వినాయక సర్కిల్ నుంచి ప్రధాన రహదారిలోని వ్యాపారస్థులతో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రచురించిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ పాలనలో ప్రజలు తీవ్రమైన అన్యాయానికి గురవుతున్న నేపథ్యంలో టీడీపీ వినూత్నంగా ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ట్లు తెలిపారు. వ్యాపారస్థులకు టీడీపీ అండగా వుంటుందన్నారు. చంద్రబా బును సీఎం చేసేందుకు మీ ఆశీస్సులు అవసరమన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య బద్దమైన, పేదలకు అనుకూలమైన పరిపాలన రావాలంటే చంద్రబాబు ముఖ్య మంత్రి కావాలన్న విషయాన్ని వారికి తెలియజేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం జగన్ పాలనలో పెంచిన పన్నుల కారణంగా వ్యాపా రస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. బెల్లం వ్యాపారస్తులపై అక్రమ కేసులు పెట్టి ప్రభుత్వం వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో తెలుగు వాణిజ్యవిభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సానపురెడ్డి రవిశంకర్‌రెడ్డి, రాష్ట్ర వాణిజ్య విభాగం కోఆర్డినేటర్ వెంకటకృష్ణ, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ముదిగల్లు జ్యోతి, వైస్ ఛైర్మన్లు కడ్డిపూడి మహబూబ్ బాషా, నల్లపూల వెంకటేశులు, కౌన్సిరల్ ప్రశాంతి, టీడీపీ నాయకులు పొరాళ్లు పురుషో త్తమ్, యాల్పుల వెంకటేశులు, మండల కన్వీనర్లు హనుమంతరెడ్డి, హనుమంతు, ఇనాయత్ బాషా, జమీల్ ఖాన్ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T00:09:27+05:30 IST