ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దళితుల అన్యాయాలపై ఊరూరా చాటిచెబుదాం : టీడీపీ

ABN, First Publish Date - 2022-07-02T05:00:47+05:30

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎస్సీ కార్పొరేషనను నిర్వీర్యం చేసి సబ్‌ ప్లాననిధులు పక్కదారి మళ్లించి దళితులకు జరిగిన అన్యాయంపై ఊరూరా దళితవాడలకు వెళ్లి చాటిచెబుదామని మాజీ జడ్పీటీసీ టీడీపీ ఎస్సీసెల్‌ జిల్లా నాయకులు మేకల రామాంజినేయులు, నాయకులు అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న మాజీ జడ్పీటీసీ మేకల రామాంజినేయులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ధర్మవరంరూరల్‌, జూలై 1 : వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎస్సీ కార్పొరేషనను నిర్వీర్యం చేసి సబ్‌ ప్లాననిధులు పక్కదారి మళ్లించి దళితులకు జరిగిన అన్యాయంపై ఊరూరా దళితవాడలకు వెళ్లి చాటిచెబుదామని మాజీ జడ్పీటీసీ టీడీపీ ఎస్సీసెల్‌ జిల్లా నాయకులు  మేకల రామాంజినేయులు, నాయకులు అన్నారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గంలోని ఎస్సీసెల్‌ నాయకులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో వారు పాల్గొన్నారు. నియోజకవర్గానికి ఎస్సీ సెల్‌ నూతనంగా ఏర్పాటు చేయబోయే కమిటీపై చర్చించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంలో దళితులపై దాడులు అధికమయ్యాయని, కార్పొరేషన ద్వారా దళితులకు దక్కాల్సిన నిధులను పక్కదారి పట్టించి దళితులను అన్ని విధాలుగా జగన ప్రభుత్వం మోసం చేసిందని అన్నారు. ఎస్సీలకు ఉచిత విద్యుతపై వైసీపీ ప్రభుత్వం మాట తప్పిందని విమర్శించారు. గతంలో చంద్రబాబునాయుడు పాలనలో దళితులకు ఉచిత విద్యుత, సబ్సిడీ రుణాలు, ఇన్నోవా వాహనాలు, ట్రాక్టర్లు, ఎస్సీసబ్‌ ప్లాన నిధులతో ఎస్సీ కాలనీలు అభివృద్ధి, పెళ్లికానుకతో భరోసా, చంద్రన్న బీమా తదితర పథకాలు దళితులకు అండగా నిలిచాయన్నారు. ప్రస్తుతం వైసీపీ పాలనలో ఒక్కదళిత వాడలో కూడా సీసీ రోడ్డు వేయని పరిస్థితి ఉందని ఆరోపించారు. పార్టీబలోపేతం ప్రతిఒక్కరూ శ్రమించి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పరిటాల శ్రీరామ్‌ను, ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడును గెలుపించుకుంటే దళితులకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీసెల్‌ నాయకులు గుమ్మళ్లకుంట నారాయణస్వామి, మండల అధ్యక్షుడు వరదరాజులు, మొండి శ్రీనివాసులు, శివ, ప్రభు, ఆదినారాయణ, పోతలయ్య, నారాయణస్వామి, సుబ్రమణ్యం, గంగాధర్‌, గురుస్వామి, నాగార్జున, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. 


Updated Date - 2022-07-02T05:00:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising