ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్టీసీ బస్సు చార్జీల పెంపుపై భగ్గుమన్న వామపక్షాలు

ABN, First Publish Date - 2022-07-03T05:26:36+05:30

రెండు నెలలు తిరగకనే ప్రభుత్వం మరోసారి ఆర్టీసీ చార్జీలను పెం చడంతో వామపక్ష పార్టీలు భగ్గుమన్నాయి. శనివారం జిల్లావ్యాప్తం గా ఆర్టీసీ బస్టాండ్ల ఎదుట ఆందోళనకు దిగాయి.

పెనుకొండ ఆర్టీసీ బస్టాండు ఎదుట సీపీఐ నాయకుల నిరసన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హిందూపురం టౌన/పెనుకొండ/మడకశిర టౌన, జూలై 2: రెండు నెలలు తిరగకనే ప్రభుత్వం మరోసారి ఆర్టీసీ చార్జీలను పెం చడంతో వామపక్ష పార్టీలు భగ్గుమన్నాయి. శనివారం జిల్లావ్యాప్తం గా ఆర్టీసీ బస్టాండ్ల ఎదుట ఆందోళనకు దిగాయి. హిందూపురం ఆ ర్టీసీ బస్టాండు ఎదుట ఎస్‌ఎ్‌ఫఐ నాయకులు మోకాళ్లపై నిలబడి ని రసన తెలిపారు. సీపీఐ నాయకులు డిపో గేటు ఎదుట బైఠాయించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెనుకొండలో సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ బస్టాండు ఎదుట ఆందోళన చేపట్టారు. మడకశిర డిపో ఎదుట ఎస్‌ఎ్‌ఫఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.  అంతకు ముందు పట్టణంలోని రాజీవ్‌గాంధీ సర్కిల్‌ నుంచి ఆర్టీసీ డిపో వరకు ర్యాలీగా వచ్చి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జగన్మోహనరెడ్డి పాదయాత్ర చేసినప్పుడు చార్జీలు పెంచమని హామీ ఇచ్చారన్నారు. అయితే అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే మూడుసార్లు చార్జీలు పెంచి పేదలకు పెనుభారం మోపారని విమర్శించారు. విద్యార్థుల అర్టీసీ బస్సు పా సుల ధరలు పెంచి బాదుతున్నారని వాపోయారు. పెంచిన చార్జీలు తగ్గించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. హిందూపురం నిరసనలో ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా కార్యదర్శి బాబావలి,  జ యచంద్ర, జశ్వంత, హర్ష, బీఎస్పీ నాయకులు శ్రీరాములు, ఆర్సీపీ శ్రీనివాసులు, సీపీఐ దాదాపీర్‌, ఎంఐఎం మున్న, హరికుమార్‌, ఈ శ్వరయ్య, నజీంబాషా, పెనుకొండలో నాయకులు సీపీఐ నాయకులు శ్రీరాములు, వెంకటేశులు, మల్లికార్జున, వెంకటలక్ష్మమ్మ, ఏఐటీయుసీ నాయకులు కిష్టప్ప, ఫిరోజ్‌ఖాన, జాఫర్‌, సీపీఎం నాయకులు హరి, రమేష్‌, గౌస్‌లాజం, కేవీపీఎస్‌ నాయకులు గంగాధర్‌, ఆటో యూనియన నాయకులు వజ్రం నాగప్ప, వెంకటరాముడు, వెంకటేశులు, మడకశిరలో ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా కార్యదర్శి ఈరేష్‌, నాయకులు మంజు, మహేష్‌, సిద్దు, భరతపాల్గొన్నారు. 


Updated Date - 2022-07-03T05:26:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising