ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెరువు తూముల వద్ద లీకేజీ

ABN, First Publish Date - 2022-01-23T05:36:57+05:30

మండలంలోని ఏలుకుంట్ల చెరువు గత ఏడాది వర్షాలకు చెరువు నిండింది. ఎన్నో ఏళ్లకిత్రం తర్వాత చెరువు నిండటంతో ఆ గ్రామరైతులు ఎంతో సంబరపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నీరు వృథా.. పట్టించుకోని అధికారులు

ఆందోళనలో ఏలుకుంట్ల గ్రామ ప్రజలు

ధర్మవరంరూరల్‌, జనవరి 22: మండలంలోని ఏలుకుంట్ల చెరువు గత ఏడాది వర్షాలకు చెరువు నిండింది. ఎన్నో ఏళ్లకిత్రం తర్వాత చెరువు నిండటంతో ఆ గ్రామరైతులు ఎంతో సంబరపడ్డారు. భూగర్భజలాలు అడు గింటిపోతున్న తరుణంలో చెరువు నిండటంతో ఆ గ్రామరైతులు ఆశలు కొన్ని నెలలకే ఆవిరైపోతున్నాయి. చెరువు తూముల వద్ద భారీగా నీరు లీకేజీ కావడంతో చెరువు నీరంతా వృథాగా పోతోంది. చెరువులో నీరు వృథా అయితే బోరుబావులతో పాటు గ్రామంలో తాగునీటి సమస్య ఏర్పడుతుందని,  చెరువులో నీరు ఉండ టంతో ఈ ఏడాది వేసవిలో గ్రా మంలో తాగేందుకు నీరు ఇబ్బందులు ఉండవని భావించిన ఆ గ్రామ స్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటిని అరికట్టాలని అధికారులకు తె లిపిన పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.  బోరు బావు ల్లో నీరు సమృద్ధిగా పెరగడంతో పంటలు సాగుచేసుకునేందుకు వీలుకలు గుతోందని చెరువు నీరంతా వృథాగా పోతే మళ్లీ గతంలో మాదిరిగానే బోరుబావుల్లో ఇంకిపోయే ప్రమాదం ఉందని రైతులు గగ్గోలు పెడు తున్నారు. చెరువు నిండినప్పుడే తూముల వద్ద నీరులీకేజీ అధికంగా పో తుండటంతో అధికారులు వచ్చి తూతుమంత్రంగా ఇసుకమూటలు వేసి వదిలేశారని, అయి నా లీకేజీ ఆగలేదని రైతులు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చెరువు నీరు వృథాగా పోకుండా అరికట్టాలని గ్రా మ రైతులు, ప్రజలు కోరు తున్నారు. 

Updated Date - 2022-01-23T05:36:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising