ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కుమ్మనమల సచివాలయం ఖాళీ

ABN, First Publish Date - 2022-05-31T06:45:33+05:30

పుట్లూరు మండలంలోని కుమ్మనమల సచివాలయం సోమవారం ఖాళీగా కనిపించింది. సోమవారం ఫిర్యాదుల దినం.

ఖాళీగా సచివాలయం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పుట్లూరు మండలంలోని కుమ్మనమల సచివాలయం సోమవారం ఖాళీగా కనిపించింది. సోమవారం ఫిర్యాదుల దినం. ఉద్యోగులు ఎవరూ లేకపోవడంతో వివిధ సమస్యలతో వచ్చిన ప్రజలు వెనక్కి వెళ్లారు. సచివాలయంలో 10 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. మూడునెలల నుంచి వీరికి జీతాలు ఇవ్వలేదు. పంచాయతీ కార్యదర్శి అశ్వర్థరెడ్డిని జీతాలకు బిల్లులు పెట్టాలని పలుమార్లు చెప్పినా పట్టించుకోలేదని, సాకులు చెబుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. బిల్లులు పెట్టాలంటే ముడుపులు ఇవ్వాలని ఓ అధికారి కోరడంతో సమస్య వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆగ్రహించిన ఉద్యోగులు సోమవారం సచివాలయం విడిచి, ఎంపీడీఓ యోగానందరెడ్డి వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశారు. జీతాలు రాకపోతే ఎలా బతకాలని వాపోయారు. కార్యదర్శికి ఐడీ ఆలస్యంగా రావడం, ట్రెజరీలో సమస్య ఉండటంతో జీతాలు రాలేదని ఎంపీడీవో వివరణ ఇచ్చారు. 

- పుట్లూరు 

Updated Date - 2022-05-31T06:45:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising