క్రీడా స్ఫూర్తిని విధుల్లోనూ కొనసాగించండి
ABN, First Publish Date - 2022-12-31T00:32:12+05:30
క్రీడల్లో కనబరిచిన క్రీడా స్ఫూర్తిని విధుల్లోనూ కొనసాగించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప పోలీసు శాఖ అధికా రులు, సిబ్బందికి సూచించారు. నాలుగు రోజులుగా స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్-2022 కార్యక్రమం శుక్రవారం ముగిసింది.
పోలీసు సిబ్బందికి ఎస్పీ ఫక్కీరప్ప సూచన
ముగిసిన పోలీస్ క్రీడలు
అనంతపురం క్రైం, డిసెంబరు 30: క్రీడల్లో కనబరిచిన క్రీడా స్ఫూర్తిని విధుల్లోనూ కొనసాగించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప పోలీసు శాఖ అధికా రులు, సిబ్బందికి సూచించారు. నాలుగు రోజులుగా స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్-2022 కార్యక్రమం శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎస్పీ అతిథిగా హాజరై మాట్లాడారు. విధుల్లో బిజీగా ఉన్న పోలీసులకు క్రీడలు ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తాయన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు నాగేంద్రుడు, రామకృష్ణ ప్రసాద్, హనుమంతు, డీఎస్పీలు పాల్గొన్నారు. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల పోలీస్ స్పోర్ట్స్, గేమ్స్ మీట్ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. మొత్తం 11టీమ్‌లకు గాను ఓవరాల్ చాంపియనగా శ్రీ సత్యసాయి జిల్లా ఏఆర్ విభాగం నిలిచింది. వ్యక్తిగత టీమ్‌ల విభాగంలో ఓవరాల్ చాంపియనగా అనంతపురం జిల్లా ఏఆర్ (మెనఅండ్‌ఉమెన)జట్లు నిలిచాయి. వాలీబాల్, బాస్కెట్‌బాల్, కబడ్డీ, క్రికెట్, టెన్నిస్, బ్యాడ్మింటన, పరుగు పోటీలు, హైజంప్, లాంగ్ జంప్, ట్రిపుల్ జంప్, షాట్‌పుట్, డిస్క్‌సత్రో, జావెలినత్రో, యోగాలలో పోటీలలో విజేతలకు ఎస్పీ జ్ఞాపికలను అందజేశారు.
Updated Date - 2022-12-31T00:32:15+05:30 IST