ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాడవాడలా... కన్నయ్య సందడి..

ABN, First Publish Date - 2022-08-20T05:11:04+05:30

ఊరువాడా ఎక్కడ చూసినా గోకులాలే. రాధాకృష్ణులు, గోపికల వేషధారణలో చిన్నారులు సందడి చేశారు.

సాయి కుల్వంతలో గోవులకు పూజలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లావ్యాప్తంగా ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

రాధాకృష్ణులు, గోపికల వేషధారణలో అలరించిన చిన్నారులు

పుట్టపర్తి,  ఆగస్టు 19: ఊరువాడా ఎక్కడ చూసినా గోకులాలే.  రాధాకృష్ణులు, గోపికల వేషధారణలో చిన్నారులు సందడి చేశారు. వారిని చూసి తల్లిదండ్రులు మురిసిపోయారు. జిల్లావ్యాప్తంగా శుక్రవారం శ్రీకృష్ణజన్మాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. పలుచోట్ల ఉట్టి కొట్టే కార్యక్రమం ఏర్పాటు చేశారు. పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. హిందూపురంలోని వేణుగోపాల స్వామి ఆలయంలో భక్తిశ్రద్ధలతో కృష్ణాష్టమి ఆచరించారు. రుక్మిణి, సత్యభామ అమ్మవార్లతో స్వామివారి కల్యాణోత్సవం చేశారు. అనంతరం భారీగా తరలివచ్చిన భారీ భక్తజనం నడుమ రథోత్సవం నిర్వహించారు. ధర్మవరంలోని చెన్నకేశవ స్వామి ఆలయంలో ఉట్టి కొట్టే కార్యక్రమం ఏర్పాటు చేశారు.

పుట్టపర్తిలోని సాయికుల్వంత సభామండపంలో సత్యసాయి మహాసమాధిని ప్రత్యేకంగా అలంకరించి, పూజలు చేశారు. విద్యార్థుల వేదపఠనంతో కృష్ణాష్టమి వేడుకలు ప్రారంభమయ్యాయి. సత్యసాయి గోకులంనుంచి గోవులను ప్రత్యేకంగా అలంకరించి సాయికుల్వంత సభామండపానికి తీసుకొచ్చారు. సెంట్రల్‌ ట్రస్టు మేనేజింగ్‌ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్‌.. గోవులకు పూజలు చేసి, పండ్లు ఫలహారాలు అందించారు. లేగదూడకు పాలు పట్టారు. అనంతరం విద్యార్థులు గోవర్ధన గిరిధారి అంటూ భక్తిపాటలు ఆలపిస్తూ.. నృత్యాలతో అలరించారు.








Updated Date - 2022-08-20T05:11:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising