ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేషన పంపిణీలో కానరాని కందిపుప్పు, పంచదార

ABN, First Publish Date - 2022-11-16T00:01:44+05:30

చౌకధరల డిపోల ద్వారా పేద ప్రజలకు పంపిణీ చేసే రాయితీ సరుకులు బియ్యం వరకే పరిమితమయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కదిరి అర్బన, నవంబరు 15 : చౌకధరల డిపోల ద్వారా పేద ప్రజలకు పంపిణీ చేసే రాయితీ సరుకులు బియ్యం వరకే పరిమితమయ్యాయి. ప్రతి నెలా మూడు రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్న ప్రభుత్వం నవంబరు నెలకు సంబంధించిన రేషను సరుకులలో రెండింటికి కోత పెట్టింది. వీటిని సకాలంలో అందించక పోవడంతో కార్డులబ్ధిదారులు బియ్యంతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రతి నెలా కందిపప్పు, పంచదార, బియ్యం పంపిణీ చేయాల్సి ఉండగా, ఈనెల 1వతేదీ నుంచి ఎంబీయూల ద్వారా పంపిణీ చేస్తున్న రాయితీ సరుకులలో బియ్యం మాత్రమే కార్డుదారులకు అందిస్తున్నారు. కందిపప్పు, పంచదార కూడా ఇవ్వాలని కోరగా, స్టాకు రాలేదని చెప్పడంతో నిరాశతోనే లబ్ధిదారులు వెనుదిరుగుతున్నారు.

గతంలో ఇలా...

చౌకఽధరల దుకాణాల ద్వారా గత ప్రభుత్వం అనేక సరుకులను పేలకు అందించేది. వాటిని ప్రతి నెలా సకాలంలో అందించచేవారు. అలాగే ప్రత్యేకంగా సంక్రాంతి కానుక, రంజానతోఫా, క్రిస్టిమస్‌ కానుక వంటి వాటి కింద ఐదు రకాల సరుకులను చౌకధాన్యపు దుకాణం ద్వారా అందించేవారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సన్నబియ్యం అందిస్తామన్న పాలకులు వాటిని క్రమంగా తగ్గించుకుంటూ వచ్చారు. ప్రస్తుతం కందపప్పు, బియ్యం, పంచదారను మాత్రమే కార్డు లబ్ధిదారులకు రాయితీపై పంపిణీ చేస్తున్నారు. మూడు నెలల నుంచి వీటిలో కూడా కోత విధించి బియ్యం మాత్రమే పంపిణీ చేస్తున్నట్లు లబ్ధిదారు లు పేర్కొంటున్నారు. చేసేది లేక బి య్యం తీసుకుని అధిక ధరలకు మిగతా సరుకులను బహిరంగ మార్కెట్‌లో కొను గోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని లబ్ధిదారులు విమర్శిస్తున్నారు.

కమీషన్లు రాక డీలర్లు గగ్గోలు

చౌకఽధరల డిపోలకు పంచదారను కోత విధించడంతో పాటు.... దానిపై కమిషన్ల రూపంలో వచ్చే ఆదాయం రాక డీలర్లు లబోదిబోమంటున్నారు. గతంలో కార్డులబ్ధిదారులకు నాలుగు సరుకులు వచ్చేవి. రేషను డీలర్లకు నాలుగు సరుకులమీద కమీషను గిట్టుబాటయ్యేది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క సరుకును కోత విధిస్తూ చివరకు బియ్యం ఒక్కటే పంపిణీ చేస్తోంది. దీంతో డీలర్లు కమీషన కోతతో చౌకధాన్యపు డిపో నిర్వహించేందుకు సైతం ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

నిల్వలు లేక పంపిణీ చేయలేకపోతున్నాం - నవీన కుమార్‌, సీఎస్‌డీటీ, కదిరి

కందిపప్పు, పంచదార నిల్వల కొరతతో నిత్యావసర సరుకుల సరఫరాలో జాప్యం జరుగుతోంది. ఇప్పటికే డీలర్లు డీడీలు చెల్లించారు. మంజూరు కాగానే కందిపప్పు, పంచదార పంపిణీ చేస్తాం.

Updated Date - 2022-11-16T00:01:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising