ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kalva Srinivasulu: మంత్రి పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో గ్రానైట్, విలువైన ఖనిజాలు కబ్జాకు గురి..

ABN, First Publish Date - 2022-09-28T20:54:29+05:30

రాష్ట్రంలోని సహజ వనరులనూ వైసీపీ దురాక్రమణదారులు వదలడంలేదని కాల్వ శ్రీనివాసులు విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి (Amaravathi): రాష్ట్రంలోని సహజ వనరులనూ వైసీపీ దురాక్రమణదారులు వదలడంలేదని  టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు (Kalva Srinivasulu) విమర్శించారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra reddy) ఆధ్వర్యంలో గ్రానైట్, విలువైన ఖనిజాలు కబ్జాకు గురౌతున్నాయన్నారు. ఓబులాపురంలోని 25 హెక్టార్ల విస్తీర్ణంలోని మైనింగ్ ఓర్..  ఓ బడా కాంట్రాక్టర్‌కు ధారాదత్తం చేశారని ఆరోపించారు. ఏపీ ఎండీసీ ద్వారా ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు.


తెలంగాణకు చెందిన ఓ ప్రైవేటు వ్యక్తికి రాష్ట్ర మైనింగ్ ఓర్ అప్పగించాల్సిన అవసరమేంటని కాల్వ శ్రీనివాసులు ప్రశ్నించారు. మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా తెలంగాణకు అక్రమ మైనింగ్ తరలిస్తున్నారన్నారు. ప్రభుత్వ గనుల్లో ప్రైవేటు వ్యక్తుల అజమాయిషీతో గనుల తవ్వకాలు జరుగుతున్నాయని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని గనుల అక్రమాలు జరుగుతున్నాయన్నారు. ఓబులాపురం వద్ద సీబీఐ సీజ్ చేసిన ఇనుప ఖనిజాన్ని అక్రమంగా తరలిస్తున్నారని, ప్రభుత్వం విలువైన ఇనుప ఖనిజ సంపద దోపీడీపాలు కాకుండా కాపాడాలని అన్నారు. ఓబులాపురం మైనింగ్ దోపిడీని అరికట్టాలని, వైసీపీ నాయకుల ఇసుక, మట్టిని యదేచ్ఛగా దోచుకోవడాన్ని నియంత్రించాలని కాల్వ శ్రీనివాసులు కోరారు.

Updated Date - 2022-09-28T20:54:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising