ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన ప్రభుత్వాన్ని ఇంటికి పంపేందుకు పోరాటం

ABN, First Publish Date - 2022-01-28T05:34:41+05:30

నిద్రమత్తులో ఉన్నట్లు నటిస్తున్న జగన నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేందుకు పోరాటం చేస్తామని ఐక్యవిద్యార్థి సంఘాల జేఏసీ నాయకులు హెచ్చరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట 

ఐక్యవిద్యార్థి సంఘాల జేఏసీ నిరసన

అనంతపురం క్లాక్‌టవర్‌, జనవరి 27: నిద్రమత్తులో ఉన్నట్లు నటిస్తున్న జగన నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేందుకు పోరాటం చేస్తామని ఐక్యవిద్యార్థి సంఘాల జేఏసీ నాయకులు హెచ్చరించారు. నిరుద్యోగుల వయోపరిమితి పెంచాలనీ, రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 2.5లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌ చేస్తూ గురువారం వారు స్థానిక జడ్పీ సమీపంలోని అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట కళ్లకు గంతలు కట్టుకుని, నిరసన తెలిపారు. జేఏసీ నాయకులు ఎనఎ్‌సయూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేష్‌, ఏపీఎ్‌సఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు రాఘవేంద్ర, టీఎనఎ్‌సఎ్‌ఫ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీంద్రనాయక్‌, ఏఐఎ్‌సబీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఫృథ్వీ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఓ వైపు నిరు ద్యోగులు ఉద్యోగాల కోసం, మరోవైపు ఉద్యోగులు పీఆర్సీ కోసం పోరాడుతుంటే సీఎం జగన నిర్లక్ష్యంగా వ్యవహరించటం దుర్మార్గమన్నారు. ఈ సమస్యలను పక్కదోవ పట్టించేందుకే కొత్త జిల్లాల అంశాన్ని ముఖ్యమంత్రి తెరపైకి తీసుకువచ్చారని విమర్శించారు. కార్యక్రమంలో టీఎ్‌సఎ్‌సఎఫ్‌ నాయకులు హరికృష్ణ, ఎనఎ్‌సయూఐ జిల్లా అధ్యక్షుడు ఓబులేసు, ఏపీఎ్‌సఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు సురేష్‌, నాయకులు పాల్గొన్నారు.


Updated Date - 2022-01-28T05:34:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising