ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈరు.. నీడ. ఎక్కడ!

ABN, First Publish Date - 2022-06-06T06:12:36+05:30

వేసవి వస్తోందంటే ప్రభుత్వం ముందు జాగ్రత్తలు పాటించాలి. తాగునీటి ఎద్దడి నివారణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేసవి వస్తోందంటే ప్రభుత్వం ముందు జాగ్రత్తలు పాటించాలి. తాగునీటి ఎద్దడి నివారణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. వేసవి ముగిసి.. వర్షాకాలం మొదలవుతోంది. ఇప్పటికీ కొళాయిల వద్ద జలయుద్ధం తప్పడం లేదు. వేసవిలో కూలీలకు పనులు ఉండవు. అందుకే ఉపాధి పథకం పనులు కల్పిస్తారు. పని ప్రదేశంలో తాగునీరు, నీడ కల్పించాలి. ప్రథమ చికిత్సకు కిట్లు ఇవ్వాలి. కానీ ఇవ్వడం లేదు. ఆంధ్రజ్యోతి క్షేత్రస్థాయిలో  పరిశీలనలో ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు  కనిపించింది. 

-  ఆంధ్రజ్యోతి, అనంతపురం




అక్కడికి వెళ్లి.. 

విడపనకల్లు మండలంలోని వి.కొత్తపేట బీసీ కాలనీలో రెండు సంవత్సరాలుగా ప్రజలు తాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. కాలనీలో 400కిపైగా కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడి చేతిపంపు నిరుపయోగంగా మారింది. తాగునీటి సమస్య తీర్చాలని ప్రజాప్రతినిధులు, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదు. మండల కేంద్రానికి ప్రతిరోజూ వెళ్లి రూ.40 ఖర్చుచేసి నీటిని కొని తెచ్చుకుని తాగుతున్నారు. 


లీకేజీ సమస్య

రాయదుర్గం పట్టణ శివారులోని పైతోట, వెంకటేశ్వర కాలనీ, శాంతినగర్‌, సిద్దేశ్వర కాలనీ, భగతసింగ్‌ నగర్‌, మొలకాల్మూరు రోడ్డు తదితర ప్రాంతాలకు నాలుగు రోజులకు ఒకసారి కొళాయిలకు నీరు వదులుతున్నారు. కణేకల్లు నుంచి రాయదుర్గానికి నీరు సరఫరా అయ్యే పైపులైన దెబ్బతినింది. దీంతో లీకేజీలు ఏర్పడి, తాగునీటి సరఫరాలో తీవ్ర అంతరాయం కలుగుతోంది. తాగునీటి ఇబ్బందులు ఎక్కువ కావడంతో ఇటీవల పట్టణవాసులు ఖాళీ బిందెలతో సచివాలయం వద్ద ఆందోళనకు దిగారు. అయినా పరిస్థితిలో మార్పు రాలేదు.



మండే  ఎండలో..

వజ్రకరూరు మండలం చాబాలలో ఉపాధి పనుల వద్ద కూలీలకు ఎలాంటి సౌకర్యాలు కల్పించ లేదు. తాగునీరు ఇంటి నుంచి తెచ్చుకుంటున్నారు. టార్పలిన్లు లేక.. పని పూర్తయ్యేవరకూ మండే ఎండలో గడుపుతున్నారు. ప్రథమ చికిత్స కిట్లు లేవు. మండలంలోని 19 పంచాయతీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.



చుక్క నీరు లేదు..

గుత్తి మండలంలోని బేతాపల్లి ఎస్సీ కాలనీలో గుక్కెడు నీరు దొరకడం లేదు. వైటీ చెరువు ప్రాజెక్టు నుంచి నీటి సరఫరా 20 రోజుల క్రితం నిలిచిపోయింది. దీనికి తోడు బోరు బావి మోటారు చెడిపోయింది. కాలనీవాసులు కొళాయిల దగ్గర బిందెడు నీటికోసం పడిగాపులు కాస్తున్నారు.



ఇంటి నుంచే నీరు..

కంబదూరు మండలంలో ఉపాధి కూలీల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ములకనూరులో మండుటెండలో కూలీలు ఇలా పనిచేస్తున్నారు. కాసేపు సేదదీరేందుకు నీడ కల్పించడం లేదు. ఉపాధి పనులు చేసేచోట టెంట్లు ఏర్పాటు చేయాలి. కానీ పట్టించుకోవడం లేదు. తాగునీటిని ఇళ్ల నుంచి బాటిళ్లలో తీసుకువెళుతున్నారు. 

Updated Date - 2022-06-06T06:12:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising