ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వార్డెన్ల బదిలీల్లో అవకతవకలు

ABN, First Publish Date - 2022-07-06T06:34:17+05:30

ఎస్సీ సంక్షేమ శాఖ వార్డెన్ల బదిలీల విషయంలో అవకతవకలు జరిగాయని ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు

సూపరింటెండెంట్‌కు వినతిపత్రం అందజేస్తున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘాల నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విచారణ చేపట్టాలని ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘాల డిమాండ్‌

అనంతపురం ప్రెస్‌క్లబ్‌, జూలై 5: ఎస్సీ సంక్షేమ శాఖ వార్డెన్ల బదిలీల విషయంలో అవకతవకలు జరిగాయని ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. వెంటనే రీ-ట్రాన్సఫర్స్‌ జరిపి నిబంధనల మేరకు బదిలీలు జరపాలని ఆ శాఖ సూపరింటెండెంట్‌ వెంకటలక్ష్మిని కోరారు. ఈ మేరకు మంగళవారం రీ-బదిలీలు నిర్వహించాలని కోరుతూ ఆ శాఖ సూపరింటెండెంట్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాదిగ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నగేష్‌, అఖిల భారత విద్యార్థి బ్లాక్‌ పాపిరెడ్డిపల్లి పృధ్వి మాట్లాడారు. తాజాగా జరిగిన బదిలీల్లో డీడీ విశ్వమోహనరెడ్డి ఎనిమిది మంది వార్డెన్లను సొంత మండలాలకే బదిలీచేసి.. మరికొంత మందిని ఇష్టానుసారంగా బదిలీ చేశారని మండిపడ్డారు. కేవలం తన సామాజిక వర్గానికి చెందిన వారిని మాత్రమే అనుకూలంగా బదిలీలు చేసి... మిగిలిన వార్డెన్లకు అన్యాయం చేశారన్నారు. కావున ఈ విషయంలో జిల్లా కలెక్టర్‌, జేసీలు చొరవ తీసుకొని రీ-ట్రాన్సఫర్సర్‌ నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఎస్సీ,ఎస్టీ ఐక్యవేదిక నాయకులు మధు, శాంతకుమార్‌, గురు మోహన, ముడ్లరాము, కృష్ణ, రామాంజనేయలు పాల్గొన్నారు.


Updated Date - 2022-07-06T06:34:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising