ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైల్వే లైన డబ్లింగ్‌ పనుల తనిఖీ

ABN, First Publish Date - 2022-08-19T05:17:08+05:30

గుత్తి-ధర్మవరం రైల్వే సెక్షనలో జరుగుతున్న డబ్లింగ్‌, విద్యుద్దీకరణ పనులను చీఫ్‌ కమిషనర్‌ ఆఫ్‌ రైల్వే సేఫ్టీ (సీసీఆర్‌ఎస్‌) అధికారి శైలేశ కుమార్‌ పాథక్‌ గురువారం తనిఖీలు నిర్వహించారు.

తాటిచెర్ల స్టేషనలో కంట్రోల్‌ బోర్డు ప్యానెల్‌నుపరిశీలిస్తున్న సీసీఆర్‌ఎస్‌ అధికారి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


గుంతకల్లు/అనంతపురం న్యూటౌన ఆగస్టు 18: గుత్తి-ధర్మవరం రైల్వే సెక్షనలో జరుగుతున్న డబ్లింగ్‌, విద్యుద్దీకరణ పనులను చీఫ్‌ కమిషనర్‌ ఆఫ్‌ రైల్వే సేఫ్టీ (సీసీఆర్‌ఎస్‌)  అధికారి శైలేశ కుమార్‌ పాథక్‌ గురువారం తనిఖీలు నిర్వహించారు. తాటిచెర్ల-జంగాలపల్లి రైల్వే స్టేషన్ల మధ్య జరుగుతున్న రైల్వే లైన డబ్లింగ్‌, ఎలెకి్ట్రఫికేషన పనులు పూర్తికావడంతో సీసీఆర్‌ఎస్‌ అధికారి తనిఖీలు చేపట్డారు. ఆయన పరిశీలనలో సంతృప్తిపడితే ఈ మార్గంలో రైళ్లను నడపడానికి అనుమతులు లభిస్తాయి. ఈ మేరకు ఉదయం 7 గంటలకు గుంతకల్లుకు వచ్చిన సీసీఆర్‌ఎస్‌, ఆయన సహాయకుల వెంట స్థానిక డీఆర్‌ఎం వెంకట రమణారెడ్డి, సబార్డినేట్‌ అధికారులు లైనపై వెళ్లారు. ఈ లైనలో విద్యుద్దీకరణ పనితీరు, రైల్వే ట్రాక్‌ పటిష్టత, నిర్మాణ పనుల్లో నాణ్యత, ఇతర లోటుపాట్లను అంచనావేసి ఈ మార్గంలో వేగంగా రైలును నడిపి ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఈ సెక్షనలో రైళ్లను నడపడానికి అనుమతులు లభిస్తే గుంతకల్లు-జంగాలపల్లి వరకూ డబుల్‌ లైన నిరాటంకం అవుతుంది. ఈ మార్గంలో రైళ్లు వేగంగా నడవడానికి, క్రాసింగ్‌ల వల్ల జాగు ఏర్పడకుండా ఉండటానికి వీలౌతుంది. రాత్రి వరకూ జరిగిన సీసీఆర్‌ఎస్‌ తనిఖీల్లో ప్రిన్సిపల్‌ చీఫ్‌ ఇంజనీరు, చీఫ్‌ బ్రిడ్జి ఇంజనీరు, చీఫ్‌ ఫీల్డ్‌ ఇంజనీరు, తదితరులు పాల్గొన్నారు

Updated Date - 2022-08-19T05:17:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising