ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాల సేకరణ కేంద్రాన్ని పరిశీలించిన జేసీ

ABN, First Publish Date - 2022-01-13T06:23:31+05:30

మండల పరిధిలోని కాళసముద్రం గ్రామంలో జగనన్న పాలవెల్లువ పాల సేకరణ కేంద్రాన్ని బుధవారం జేసీ నిశాంత్‌కుమార్‌ పరి శీలించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కదిరిఅర్బన్‌, జనవరి 12: మండల పరిధిలోని కాళసముద్రం గ్రామంలో జగనన్న పాలవెల్లువ పాల సేకరణ కేంద్రాన్ని బుధవారం జేసీ నిశాంత్‌కుమార్‌ పరి శీలించారు. ఈ సందర్భంగా పాడి రైతులను ఉద్దేశించి జేసీ మాట్లాడుతూ  పశు వులు కొనుగోలు చేయడానికి డీసీసీబీ ద్వారా రుణాలు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. జగనన్న పాలవెల్లువ కార్యక్రమం ద్వారా పాడి రైతులకు జీవనోపాధి కల్పిస్తున్నామన్నారు. అమూల్‌ సంస్థ ద్వారా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి, ప్రతి ఇంటిలో పాడిపరిశ్రమ ఉండేలా చూస్తామన్నారు. పాల డెయిరీలకు ఆర్థిక దన్ను కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశ పెట్టిందన్నారు. ఈ పథకం ద్వారా పాలకు గిట్టుబాటు ధర, పాడి రైతుకు ఆర్థిక భరోసా లభించ నుందన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటరెడ్డి, ఎంపీడీఓ రమేష్‌బాబు, ఏపీఎం శారద, పంచాయతీ కార్యదర్శి అబ్దుల్‌ మునాఫ్‌,  రైతులు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-13T06:23:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising