ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అసమర్థ పాలన: కాలవ

ABN, First Publish Date - 2022-09-28T05:26:31+05:30

రాష్ట్రంలో అసమర్థపాలన కొనసాగుతోందని మాజీమంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరోసభ్యుడు కాలవ శ్రీనివాసులు విమర్శించారు.

రాయదుర్గంలో కరపత్రాలు పంపిణీ చేస్తున్న మాజీ మంత్రి కాలవ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 రాయదుర్గంటౌన్‌, సెప్టెంబరు 27: రాష్ట్రంలో అసమర్థపాలన కొనసాగుతోందని మాజీమంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరోసభ్యుడు కాలవ శ్రీనివాసులు విమర్శించారు. పట్టణంలోని 14వ వార్డులో మంగళవారం నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొ న్నారు. ఇంటింటా తిరిగి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రచు రించిన కరపత్రాలను పంపిణీ చేశారు. అదేవిధంగా అధ్వానంగా వున్న రహదారులు, మురుగుకాలువలను పరిశీలించారు. రహదా రులు, మురుగుకాలువలు శుభ్రం చేసి బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లేవారు కరువయ్యారని ప్రజలు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజాసంక్షేమాన్ని విస్మరించిన పాలకు లు స్వార్థ ప్రయోజనాల కోసం పాకులాడుతున్నారని మండిపడ్డారు. మూడున్నరేళ్ల ప్రభుత్వ పాలనలో పేదల బతుకులు చిన్నాభిన్న మయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే తప్ప బడుగు, బలహీనవర్గాలకు భవిష్యత్తు వుండదన్న ప్రగాఢమైన విశ్వాసం ప్రజల్లో వ్యక్తమ వుతోం దని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి బడిగే ఇనాయత్‌, వార్డు ఇన్‌ఛార్జ్‌ అశోక్‌, టీడీపీ నాయకులు పూజారి శివ, తిప్పేస్వామి, రావూత్‌ రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-09-28T05:26:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising