ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బతుకుదెరువుకు ముంబై వెళితే..

ABN, First Publish Date - 2022-12-15T00:47:26+05:30

బతుకు తెరువు కోసం ముంబైకి వెళితే.. ఇక్కడ తమ భూమిని కొంతమంది ఆక్రమించి నివాసాలు ఏర్పాటు చేసుకున్నారని సాకే చంద్రమ్మ అనే మహిళ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. బాధితురాలు ఆంధ్రజ్యోతితో బుధవారం తన గోడును వెల్లబోసుకుని కన్నీటిపర్యంతమయ్యారు. అనంతపురం రూరల్‌ మండలం కురుగుంట సర్వే నెంబర్‌ 129/2బిలో 5.20 ఎకరాల భూమి తమకు ఉందని తెలిపారు.

తనకు జరిగిన అన్యాయాన్ని ఆంధ్రజ్యోతికి వివరిస్తున్న బాధితురాలు సాకే చంద్రమ్మ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మా భూమిని ఆక్రమించారు

కోర్టు ఆదేశాలనూ ఖాతరు చేయడం లేదు

కలెక్టర్‌ మాకు న్యాయం చేయాలి

బాధితురాలు సాకే చంద్రమ్మ వేడుకోలు

అనంతపురం, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): బతుకు తెరువు కోసం ముంబైకి వెళితే.. ఇక్కడ తమ భూమిని కొంతమంది ఆక్రమించి నివాసాలు ఏర్పాటు చేసుకున్నారని సాకే చంద్రమ్మ అనే మహిళ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. బాధితురాలు ఆంధ్రజ్యోతితో బుధవారం తన గోడును వెల్లబోసుకుని కన్నీటిపర్యంతమయ్యారు. అనంతపురం రూరల్‌ మండలం కురుగుంట సర్వే నెంబర్‌ 129/2బిలో 5.20 ఎకరాల భూమి తమకు ఉందని తెలిపారు. 1966లో ఆది ఆంధ్రా ఓబులేసుతో తమ సమీప బంధువు గుజ్జల అనంతమ్మ ఆ భూమిని కొనుగోలు చేసిందని అన్నారు. ఆ భూమి డాక్యుమెంట్‌ నెంబర్‌ 3787/1966 రికార్డులు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. 1968లో గుజ్జల అనంతమ్మ నుంచి తాను 5.20 ఎకరాల ఆ భూమిని కొనుగోలు చేశానని తెలిపారు. దీనికి సంబంధించి డాక్యుమెంట్‌ నెంబర్‌ 200/1968 రికార్డులు తమ వద్ద ఉన్నాయని అన్నారు. వ్యవసాయంపై ఆధారపడి జీవించేవారమని, సేద్యపు నష్టాల కారణంగా తీవ్రంగా ఇబ్బందిపడ్డామని అన్నారు. ఈ కారణంగా తమ కుమారుడు రాజుశెట్టి 1983లో ముంబైకి బతుకుతెరువు కోసం భార్యా పిల్లలతో వలస వెళ్లాడని అన్నారు. తాను ఇక్కడే ఉండేదానన్ని, వయోభారం కారణంగా 2008లో తానుకూడా ముంబైకి వెళ్లానని తెలిపారు. తాము ఇక్కడ లేమని తెలుసుకొని కొందరు తమ భూమిలోని 1.40 ఎకరాలను ఆక్రమించి, ఇళ్లు నిర్మించుకున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

బంధువుల ద్వారా తెలుసుకుని..

తమ భూమిని ఆక్రమించిన విషయం బంధువుల ద్వారా తెలిసిందని, 2012లో తాను కురుగుంటకు వచ్చి చూసేసరికి దాదాపు 20 కుటుంబాలు తమ భూమిలో ఇళ్లను కట్టుకున్నాయని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని రెవెన్యూ, పోలీసు అధికారులకు తెలిపి, ఆక్రమణదారులను తమ స్థలం నుంచి ఖాళీ చేయించాలని కోరానని, వారు పట్టించుకోలేదని తెలిపారు. దీంతో 2017లో ఆక్రమణదారులపై పోలీసులకు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశామన్నారు. అయినా స్పందన లేకపోవడంతో 2021లో కోర్టును ఆశ్రయించామన్నారు. ఆ భూమి తమదేనని కోర్టు పర్మినెంట్‌ ఇంజెక్షన ఆర్డర్‌ ఇచ్చిందని తెలిపారు. ఆ స్థలాన్ని ఖాళీ చేయాలని ఆక్రమణదారులకు కోర్టు నోటీసులు జారీ చేసినా... పట్టించుకోలేదని అన్నారు. కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో పోలీసుల సహకారంతో ఆ భూమిలో బోర్డు ఏర్పాటు చేసేందుకు వెళితే.. ఆక్రమణదారులు తమపై దాడి చేశారని అన్నారు. వృద్ధురాలని చూడకుండా తనను కొట్టారని కంటతడి పెట్టారు. ఈ పరిణామాల నేపథ్యంలో సెప్టెంబరులో ఎస్పీని, అక్టోబరులో కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్లను కలిసి సమస్యను తెలిపామని అన్నారు. తమ భూమిలో మరికొందరు చొరబడుతున్నారని అన్నారు. అనధికారికంగా దుకాణాలు, షాపింగ్‌ కాంప్లెక్స్‌లను నిర్మిస్తున్నారని వాపోయారు. ఆ పనులను ఆపాలని ఆర్డీఓ, సీఐ దృష్టికి తీసుకుపోయామని, వారు ఆక్రమణదారులను హెచ్చరించినా... అనధికారిక నిర్మాణాలు ఆపడం లేదని వాపోయారు. అక్రమంగా నిర్మించిన ఇళ్లకు విద్యుత కనెక్షన్లు ఇవ్వడంపై ఆ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశామని బాధితురాలు తెలిపారు. తమ ఫిర్యాదుతో విద్యుత శాఖా అధికారులు స్పందించి, అక్రమ కనెక్షన్లు తొలగించుకోవాలని నోటీసులు జారీ చేశారని అన్నారు. అనధికారికంగా తమ భూమిలో బోరు వేసిన విషయాన్ని తహసీల్దారు దృష్టికి తీసుకెళ్లామని, దీనిపై నోటీసులు జారీ చేశారని తెలిపారు. ఇంత జరిగినా ఆక్రమణదారులు ఖాళీ చేయడం లేదని, ఇప్పటికైనా కలెక్టర్‌ స్పందించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2022-12-15T00:47:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising