ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సైకో పాలన పోవాలంటే సైకిల్‌ రాజ్యం రావాలి

ABN, First Publish Date - 2022-12-16T23:48:31+05:30

రాష్ట్రంలో వైసీపీ సైకో పాలన పోవా లంటే, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీని గద్దెనెక్కించాలని టీడీపీ రాష్ట్ర ఉ పాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి పిలుపునిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ నిరసనలో

టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి

మడకశిరటౌన, డిసెంబరు 16: రాష్ట్రంలో వైసీపీ సైకో పాలన పోవా లంటే, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీని గద్దెనెక్కించాలని టీడీపీ రాష్ట్ర ఉ పాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణంలోని ఒకటో వార్డులో పార్టీ ఆధ్వర్యంలో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈసందర్భంగా పార్టీ శ్రేణులు ఇంటింటా తిరుగుతూ వైసీపీ అసమర్థ పాలనపై వివరించారు. కాలనీల్లో సమస్యలు అడిగి తెలుసు కున్నారు. రోడ్లపై వర్షపు నీరు నిలిచి బురదమయంగా మారిన ప్రాంతాల్లో పర్యటించారు. అనంతరం గుండుమల మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు గడిచినా చిన్న గుంతలకు కూడా మట్టి వేయలేని దుస్థితిలో ఉన్నారని విమర్శించారు. సైకో పాలన పోవాలంటే సైకిల్‌ రాజ్యం రావాలని, రాష్ట్రానికి చంద్రబాబుతోనే బంగారు భవిషత్తు అని ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. గొప్పలు చెప్పుకొనే ముఖ్యమంత్రి తాడేపల్లిలోని అధికార కార్యాలయానికే పరిమితమయ్యారని, క్షేత్రస్థాయిలో ప్రజలు నిత్యం అనేక ఇబ్బందులు పడుతున్నా పట్టించుకొనే నాథుడే కరవయ్యారన్నారు. ప్రతి కాలనీలో నూ రోడ్లు బురద నీటితో నిండినా, కనీసం గుంతలు పూడ్చలేని నిస్సహాయ స్థితిలో ఈప్రభుత్వం ఉండటం సిగ్గుచేటు అన్నారు. జగన అరాచక పాలన కు చరమగీతం పాడాలని, చంద్రబాబు రాష్ట్ర పగ్గాలు చేపడితేనే యువత, రైతు, ప్రజలకు భవిషత్తు ఉంటుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ శ్రీనివాసమూర్తి, మైనారిటీ జిల్లా అధ్యక్షుడు భక్తర్‌, మాజీ మున్సిపల్‌ చైర్మనలు సుబ్బరాయుడు, నరసింహరాజు, జిల్లా అధికార ప్రతినిధి నా గరాజు, యువత అధ్యక్షుడు తిమ్మరాజు, నాయకులు సోమనాథరెడ్డి, హనుమంతరెడ్డి, బేగార్లపల్లి రవి పాల్గొన్నారు.

టీడీపీలోకి చేరిక

మడకశిర రూరల్‌: మండలంలోని మణూరు పంచాయతీ గ్రామాల్లో శుక్రవారం టీడీపీ రాష్ట్ర ఉపాఽధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి ఆధ్వర్యం లో ‘ఇదేం ఖర్మ మన రాషా్ట్రనికి’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భం గా గ్రామ వైసీపీ నాయకులు మంజునాథ్‌, దాలప్ప తమ అనుచరులతో టీ డీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి తిప్పేస్వామి పసుపు కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివా్‌సమూర్తి, మండల కన్వీనర్‌ లక్ష్మీనారాయణ, క్లస్లర్‌ ఇనచార్జులు నాగరాజు, కన్నా, మల్లికార్జున, మాజీ సర్పంచు హనుమంతరాయప్ప కా ర్యకర్తలు పాల్గొన్నారు.

అవినీతి ప్రభుత్వాన్ని తరిమికొట్టండి

అమరాపురం: అవినీతి ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని తెలుగుదేశం పా ర్టీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి కే నరసింహమూర్తి, బీసీసెల్‌ జిల్లా కార్యదర్శి క్రిష్ణమూర్తి పిలుపునిచ్చారు. శుక్రవారం మండలంలోని వీరాపురంలో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి మిస్డ్‌ కాల్‌ ద్వారా ప్రజల చేత నిరసనను తెలియజేశారు. ప్రతి గ్రామంలో నూ రోడ్లు అధ్వాన్న స్థితిలో ఉన్నాయని, వీధి దీపాలు వెలగక దుర్భర పరిస్థితిని పల్లె ప్రజలు అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వైసీపీ ప్ర భుత్వ హయాంలో రైతులు, కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, అన్ని రం గాలు కుదేలయ్యారని విమర్శించారు. ప్రభుత్వం ఇప్పటికే డీజిల్‌, పెట్రోల్‌, నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెంచి, ప్రజలపై పెనుభారం మోపారని ఆగ్రహం వ్యక్తంచేశారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపేందుకు ప్రజలు కృతనిశ్చయంగా ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో ఎ స్సీ సెల్‌ నియోజకవర్గ అధ్యక్షుడ జయకుమార్‌, మైనార్టీ సెల్‌ జిల్లా అధికా ర ప్రతినిధి దాదు, జిల్లా బీసీసెల్‌ కార్యదర్శి జీటీ అనిల్‌కుమార్‌, క్లస్టర్‌ ఇనచార్జ్‌ రవికుమార్‌, పట్టణ అధ్యక్షుడు నాగరాజు, మాజీ సర్పంచ శకునప్ప, సగరు చిక్కన్న, దాదాపీర్‌, మంజునాథ్‌, మల్లికార్జున, నాయకులు ఈశ్వరప్ప, చెన్నప్ప, కార్యకర్తలు పాల్గొన్నారు.

చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి

గుడిబండ: మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని మండల కన్వీనర్‌ మ ద్దనకుంటప్ప, ఎస్సీసెల్‌ అధ్యక్షుడు మంజునాథ్‌, క్లస్టర్‌ ఇనచార్జి లక్ష్మీనరసప్ప పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని సీసీగిరి పంచాయతీ గ్రామం లో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భం గా నాయకులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి, ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని విమ ర్శించారు. రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధికి నోచుకోక వెనకబడిపోయిందని అన్నారు. ప్రజలకు ఇళ్లు, ఇసుక లేక అల్లాడిపోతున్నారన్నారు. ఈప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అ నంతరం ఇఇంటింటికీ తిరిగి ప్రభుత్వ వైఫల్యాలను వివరించారు. ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని నాయకులు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు ఈరన్న, గోవిందరాజులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అరాచక పాలనలో అభివృద్ధి శూన్యం

రొళ్ల: రాష్ట్రంలో అరాచక ప్రభుత్వ పాలనలో అభివృద్ధి అటకెక్కిందని మండల టీడీపీ నాయకులు విమర్శించారు. శుక్రవారం మండలంలోని గు డ్డగుర్కి పంచాయతీ పరిధిలోని జీఎన పాళ్యం, గొట్టుకుర్కి గ్రామాల్లో ‘ఇ దేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం చేపట్టారు. ఇంటింటికీ వెళ్లి ప్రజా స మస్యలు తెలుసుకొన్నారు. ప్రతి గ్రామంలోనూ రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, గత ప్రభుత్వ హయాంలో వేసిన వీధిదీపాలు మరమ్మతులు చేయలేని దుస్థితిలో ఉన్నారన్నారు. ఇప్పటికే డీజిల్‌, పెట్రోల్‌, నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్‌ దాసిరెడ్డి, జనరల్‌ సెక్రెటరీ ఈరన్న, ఆస్పత్రి కమిటీ మా జీ చైర్మన గురుమూర్తి, తెలుగు యువత అధ్యక్షుడు బాలకృష్ణ, గుడ్డగుర్కి పంచాయతీ మాజీ సర్పంచు కృష్ణమూర్తి, సీనియర్‌ నాయకులు వెంకటరె డ్డి, మారుతీ, గోవిందరాజులు, మాజీ సర్పంచులు వెంకటేష్‌ పాల్గొన్నారు.

పేద ప్రజలను పీల్చి పిప్పిచేస్తున్న ప్రభుత్వం

గోరంట్ల: ఒక్క అవకాశమంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ, అన్నివిధాలా ప్రజలను పీల్చిపిప్పి చేస్తున్నారని టీడీపీ నాయకులు విమర్శించారు. మండలంలోని బెల్లాలచెరువు గ్రామంలో శుక్రవారం ‘ఇదేంకర్మ మన రాష్ట్రా నికి’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా పోస్టర్లను ఆవిష్కరించి, ఇంటింటా కరపత్రాలు పంచిపెట్టారు. పెట్రోల్‌, డీజీల్‌, గ్యాస్‌, నిత్యావసర వస్తువుల ధరలు పెంచి ప్రజలపెభారం మోపారన్నారు. వైసీపీ అవినీతి పాలన, అక్రమాలు, దౌర్జన్యాలు, భూకబ్జాల గురించి వివరించారు. కార్యక్రమంలో టీడీపీ వాల్మీకి సాధికార సమితి రాష్ట్ర కమిటీ కార్యదర్శి బెల్లాల చె రువు చంద్ర, నాయకులు మనోహర్‌, జయచంద్రారెడ్డి, మూర్తి, గంగాధర్‌, బాలప్ప, గిరి, శ్రీరాములు, ఇర్షాద్‌, బాబు, నరసింహ, ఉదయ్‌, నరసింహమూర్తి, తిప్పన్న, రమణ, మారుతి, అంజి, హరి, రమేష్‌, రామాంజి, నారాయణప్ప, అనిల్‌, అక్కులేనాయక్‌, పరమేష్‌, శీన, నరేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T23:48:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising