చిత్తడి రోడ్లలో ప్రయాణం సాగేదెలా?
ABN, First Publish Date - 2022-12-12T23:49:41+05:30
తుఫాన వర్షాలు రోడ్లను చిత్తడి చేస్తున్నాయి. నాలుగు రోజులుగా జిల్లావ్యా ప్తంగా కురుస్తున్న వానలతో రోడ్లపై నీరు నిల్వ ఉంటోంది. బురద రోడ్లలో కనీసం నడక సాగించడం కూడా వీలులేని దుస్థితి నెలకుం ది. మట్టిరోడ్లపై బురద నిండుకోవడంతో జారి కిందపడి ప్రాణాలమీ దకు తెచ్చుకోవాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు.
హిందూపురం అర్బన/గుడిబండ, డిసెంబరు 12: తుఫాన వర్షాలు రోడ్లను చిత్తడి చేస్తున్నాయి. నాలుగు రోజులుగా జిల్లావ్యా ప్తంగా కురుస్తున్న వానలతో రోడ్లపై నీరు నిల్వ ఉంటోంది. బురద రోడ్లలో కనీసం నడక సాగించడం కూడా వీలులేని దుస్థితి నెలకుం ది. మట్టిరోడ్లపై బురద నిండుకోవడంతో జారి కిందపడి ప్రాణాలమీ దకు తెచ్చుకోవాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు. హిందూపు రం పట్టణ పడిబొడ్డున గురునాథ్ సర్కిల్‌కు ఎదురుగా ఉన్న లక్ష్మణరావు వీధి మరింత అధ్వానంగా మారింది. ఇటీవల కాలనీలో డ్రైనేజీ లు నిర్మించారు. కాలువలు తవ్వగా వచ్చిన మట్టిని రోడ్డుమీద పడేశారు. డ్రైనేజీలు మాత్రం పూర్తి చేశారు. మట్టిని తొలగించకపోవ డంతో తుఫానతో రోడ్డంతా చిత్తడిగా మారింది. ఈరోడ్డుపై వెళ్ళాలం టే వాహనాదారులు, పాదచారులు ఇబ్బందిపడుతున్నారు. అదుపుత ప్పి కిందపడుతున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి మట్టిని తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. అదేవిధంగా గుడిబండ మండలంలోని పీసీ గిరి గ్రామంలోని మట్టిరోడ్లు చినుకుపడితే చిత్త డిగా మారుతున్నాయి. ఎడతెరిపిలేని వానలతో మట్టిరోడ్లపై ఉనన గుంతల్లో వర్షపునీరు నిలిచి బురదమయంగా మారాయి. ప్రభుత్వం స్పందించి సీసీ రోడ్లు వేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
Updated Date - 2022-12-12T23:49:44+05:30 IST