ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎవడబ్బ సొమ్మని..!

ABN, First Publish Date - 2022-07-02T06:46:33+05:30

ఉమ్మడి జిల్లాలో శాప్‌కు చెందిన బాక్సింగ్‌, తైక్వాండో, వెయిట్‌ లిఫ్టింగ్‌ అకాడమీలు ఉండేవి. టెన్విక్‌ ఆధ్వర్యంలో ఈ మూడు అకాడమీలను టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లపాటు కొనసాగించింది.

ఇండోర్‌ స్టేడియం నుంచి ఈ సామగ్రిని తరలించారు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


ఉమ్మడి జిల్లాలో శాప్‌కు చెందిన బాక్సింగ్‌, తైక్వాండో, వెయిట్‌ లిఫ్టింగ్‌ అకాడమీలు ఉండేవి. టెన్విక్‌ ఆధ్వర్యంలో ఈ మూడు అకాడమీలను టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లపాటు కొనసాగించింది. మూడేళ్ల క్రితం ఏర్పడిన వైసీపీ ప్రభుత్వం వాటిని రద్దు చేసింది. ఈ అకాడమీలకు చెందిన క్రీడాసామగ్రి, ఫర్నీచర్‌ను అశోక్‌ నగర్‌లోని డీఎ్‌సఏ ఇండోర్‌ స్టేడియంలో భద్రపరిచారు. రూ.1.2 కోట్ల విలువైన ఈ పరికరాలను నాలుగు రోజుల క్రితం గుట్టుచప్పుడు కాకుండా కడప జిల్లాకు తరలించారు. జిల్లాకు క్రీడా సామగ్రి, పరికరాలు రావడమే గగనం. అలాంటిది గత ప్రభుత్వం సమకూర్చిన వాటిని పక్క జిల్లాకు తరలించడం ఏమిటని క్రీడాకారులు, క్రీడాభిమానులు మండిపడుతున్నారు. శాప్‌కు చెందిన ఓ కీలక అధికారి, జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి సామగ్రి తరలింపులో కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. డైనింగ్‌ టేబుల్స్‌, రీడింగ్‌ టేబుల్స్‌, చైర్స్‌, క్రీడా సామగ్రి కడపకు తరలించిన వాటిలో ఉన్నాయి. తిరిగి వీటిని జిల్లాకు తీసుకురావడం కష్టమేనని అంటున్నారు. సీఎం జగన మెప్పు కోసం ఇలా చేశారని విమర్శలు వస్తున్నాయి. శాప్‌ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే వాటిని తరలించామని, తమ సొంత నిర్ణయం కాదని డీఎ్‌సఏ చీఫ్‌ కోచ వెంకట రమణ అన్నారు. అవసరమైతే జిల్లాకు తిరిగి అందజేస్తామని చెప్పారని, ఆ ఒప్పందం ప్రకారమే పంపించామని అన్నారు.       - అనంతపురం క్లాక్‌టవర్‌



Updated Date - 2022-07-02T06:46:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising