ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హోరాహోరీగా రాతిదూలం లాగుడు పోటీలు

ABN, First Publish Date - 2022-05-27T06:12:11+05:30

మండలపరిధిలోని ఆవులాంపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న హనుమద్‌ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని గురువారం ఆరుపళ్లులోపు జరిగిన రాష్ట్రస్థాయి రాతిదూలం లాగుడు పోటీలు హోరాహో రీగా సాగాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెద్దవడుగూరు, మే 26: మండలపరిధిలోని ఆవులాంపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న హనుమద్‌ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని గురువారం ఆరుపళ్లులోపు జరిగిన రాష్ట్రస్థాయి రాతిదూలం లాగుడు పోటీలు హోరాహో రీగా సాగాయి. ఈ పోటీలను ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ పోటీ ల్లో 16జతల ఎద్దులు పాల్గొన్నాయి. మొదటి బహుమతి కడపజిల్లా వల్లూరు మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన సుబ్బారెడ్డికి చెందిన ఎద్దులు 4802 అడుగులు లాగి మొదటి బహుమతి కింద రూ.40 వేలు కైవసం చేసుకు న్నాయి. ప్రొద్దుటూరు మండలం బెస్తవారిపల్లి గ్రామానికి చెందిన జశ్విత్‌ మోహన్‌ ఎద్దులు 4603 అడుగులు లాగి  రెండో బహుమతి రూ.35 వేలు, పెద్దమొడియం మండలం పాలూరు గ్రామానికి చెందిన సుధీర్‌కుమార్‌రెడ్డి ఎద్దులు 4500 అడుగులు లాగి మూడో బహుమతి రూ.30 వేలు దక్కిం చుకున్నాయి. పుట్లూరు మండలంలోని రామలింగాయపల్లి గ్రామానికి చెందిన ఉమేష్‌చౌదరి ఎద్దులు 4365 అడుగులు లాగి నాల్గొ బహుమతి రూ.25వేలు, బళ్లారి టౌన్‌కు చెందిన రమేష్‌బాబు ఎద్దులు 4287 అడుగులు లాగి ఐదో బహుతి రూ. 20 వేలు  గెలుచుకున్నాయి.  బహుమతులను ఆలయ ధర్మ కర్త నారాయణరెడ్డి అందజేశారు. 

Updated Date - 2022-05-27T06:12:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising