ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజకీయ వేదికపై హెడ్‌ కానిస్టేబుల్‌ ఉరుసు ఉత్సవంలో సన్మానం

ABN, First Publish Date - 2022-01-24T06:23:12+05:30

ఉరుసు ఉత్సవంలో ఏర్పాటు చేసిన సన్మాన వేదికపై రాజకీయ నాయకులతో పాటు హెడ్‌ కానిస్టేబుల్‌ రఘునాథరెడ్డి కూడా ఆశీనులు కావడం తీవ్ర వివాదాస్పదం అవుతోంది.

వేదికపై కూర్చున్న హెడ్‌కానిస్టేబుల్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాయదుర్గం, జనవరి 23: ఉరుసు ఉత్సవంలో ఏర్పాటు చేసిన సన్మాన వేదికపై రాజకీయ నాయకులతో పాటు హెడ్‌ కానిస్టేబుల్‌ రఘునాథరెడ్డి కూడా ఆశీనులు కావడం తీవ్ర వివాదాస్పదం అవుతోంది. కణేకల్లు మండలంలోని మాల్యం గ్రామంలో శనివారం రాత్రి జరిగిన ఉరుసు ఉత్సవంలో ఏపీఐఐసీ చైర్మన మెట్టు గోవిందరెడ్డి, మున్సిపల్‌ మాజీ చైర్మన గౌని ఉపేంద్రరెడ్డితో పాటు చాలా మంది వైసీపీకి చెందిన నాయకులు వేదికపై ఆశీనులయ్యారు. ఒక్కొక్కరు ప్రసంగాలు చేస్తూ వచ్చారు. కాగా వారితో  సమానంగా మఫ్టీలో ఉన్న హెడ్‌ కానిస్టేబుల్‌ రఘునాథరెడ్డి కూడా ఆశీనులై సన్మానాన్ని స్వీకరించారు. రాజకీయంగా వైసీపీ శ్రేణులతో చాలా సన్నిహితంగా ఉండే ఆయన ఒక్కసారిగా వేదిక పంచుకోవడంపై ఆ పార్టీలో తీవ్ర చర్చ సాగుతోంది. దీనిపై పోలీసు  అధికారులు కూడా అవాక్కయ్యారు. ప్రభుత్వ ఉద్యోగి రాజకీయ నాయకులతో వేదికను పంచుకోవడం నిబంధనలకు విరుద్ధం. పైగా రాయదుర్గం పట్టణంలో ఉన్న రిక్రియేషన క్లబ్‌కు సహాయ కార్యదర్శిగా కూడా ఇటీవల రఘునాథరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పోలీసు శాఖలో అధికారుల పట్ల లెక్కలేనితనంతో ఉంటారనే ఆరోపణలు అతనిపై ఉన్నట్లు ఆ శాఖలో చర్చ తీవ్రంగా సాగుతోంది.  హెడ్‌ కానిస్టేబుల్‌ రఘునాథరెడ్డి గతంలో రెండు సార్లు సస్పెం డ్‌ అయిన విషయం తెలిసిందే. వైసీపీలో కీలక నాయకులు అండగా ఉండటంతో ఇష్టానుసారంగా వ్యవహరి స్తున్న ట్లు బలమైన ఆరోపణలు ఉన్నాయి. 


Updated Date - 2022-01-24T06:23:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising