ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ ఆసుపత్రి క్వార్టర్స్‌కు దారేది?

ABN, First Publish Date - 2022-08-20T04:56:33+05:30

ప్రభుత్వ ఆసుపత్రిలో అ త్యవసరమైనప్పుడు వైద్యులు అందుబాటులో ఉండాలనే సదుద్దేశం తో ఆసుపత్రి ప్రాంగణంలో క్వార్టర్స్‌ను నిర్మించారు.

రోడ్డుకు అడ్డంగా నిర్మించిన డీఈఐసీ భవనం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హిందూపురం అర్బన, ఆగస్టు 19: ప్రభుత్వ ఆసుపత్రిలో అ త్యవసరమైనప్పుడు వైద్యులు అందుబాటులో ఉండాలనే సదుద్దేశం తో ఆసుపత్రి ప్రాంగణంలో క్వార్టర్స్‌ను నిర్మించారు. అయితే అందు లో సదుపాయాలు కల్పించలేదు. దీంతో క్వార్టర్స్‌ కాలం చెల్లడంతోపాటు పరిసర ప్రాంతాలు పిచ్చిమొక్కలతో దర్శనమిస్తున్నాయి. ఇ బ్బందికర వాతావరణం నెలకొనడంతో క్వార్టర్స్‌లో వైద్యులెవరూ ఉండటానికి ఇష్టపడటం లేదు. అయితే ప్రస్తుతం ఏఎనఎం, ఎఫ్‌ఎనఎంలు మాత్రం ఆసుపత్రిలో పనిచేసే క్లర్క్‌ అంధత్వం ఉన్న వ్యక్తి నివాసముంటున్నాడు. ఇటీవల ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో క్వార్టర్స్‌కు వెళ్లే రహదారిలో డీఈఐసీ కేంద్రాన్ని నిర్మించింది. మరోవైపు ఆసుపత్రి ప్రాంగణంలో గతంలో ప్రైవేట్‌ వ్యక్తులకు టీకొట్టు పెట్టుకునేందుకు హెచడీఎ్‌స అనుమతించింది. దీంతో ఓపక్క టీకొ ట్టు ఏర్పాటు చేయడం, మరోవైపు భవనం నిర్మించడంతో క్వార్టర్స్‌కు వెళ్లే దారి మూసుకుపోయింది. క్వార్టర్స్‌లో ఉండే ఇంటికి వెళ్లాలంటే కాలినడకన వెళ్లాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇదిలా ఉంటే ఆఫీసులో పనిచేసే అంధత్వమున్న వ్యక్తి పీరా మరోవ్యక్తి సా యం లేనిదే ఇంటికి చేరలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నదారి మూసుకుపోతే, ఇంటికి వెళ్లేదె లా అంటూ వాపోతున్నారు. వర్షం వచ్చిందంటే నీరు నిలువ ఉండి అ సౌకర్యంగా మారుతోంది. సంబంధి త అధికారులు చొరవ తీసుకుని ర హదారికి అడ్డంగా ఉన్న టీకొట్టును తొలగించి దారి ఏర్పాటు చే యాలని ఆసుపత్రి సిబ్బంది కోరుతున్నారు.


దారి ఏర్పాటుకు చర్యలు చేపడతాం.. 

శివకుమార్‌, సూపరింటెండెంట్‌ 

క్వార్టర్స్‌కు వెళ్లే దారిలో ఉన్న టీకొట్టును తొలగించాలని నిర్వాహకుడికి నోటీసులిచ్చాం. త్వరలోనే తొలగించి దారి ఏర్పాటు చేస్తాం. 


Updated Date - 2022-08-20T04:56:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising