ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీసీల్లో చైతన్యం తెచ్చిన ఘనత ఎన్టీఆర్‌దే..

ABN, First Publish Date - 2022-01-19T07:04:31+05:30

భారతదేశంలోనే బీసీలను చైతన్యవంతులుగా చేసిన ఘనత ఒక్క నందమూరితారకరామారావుకే దక్కుతుందని మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు

ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తున్న కందికుంట
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 మాజీ మంత్రి పల్లె

కొత్తచెరువు, జనవరి 18: భారతదేశంలోనే బీసీలను చైతన్యవంతులుగా చేసిన ఘనత ఒక్క నందమూరితారకరామారావుకే దక్కుతుందని మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఎన్టీఆర్‌ 26వవర్దంతి సందర్భంగా నాలుగురోడ్ల కూడలిలో ఎన్టీఆర్‌ విగ్రహానికి పల్లెపూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.  పల్లె మాట్లా డుతూ.....మొట్టమొదట భారతదేశంలో రూ.2లకే కిలో బియాన్ని ప్రవేశపెట్టి పేదవాడి ఆకలితీర్చి వారి గుండెల్లో ఆరాధ్యదైవంగా నిలిచిపోయారన్నారు. వైసీపీ ప్రభుత్వం పాలనలో బీసీలను అణిచివేయడం పనిగా పెట్టుకుందన్నారు. రెం డున్నర ఏళ్లపాలనలో నిత్యావసర సరుకులతో పాటు చివరికి చెత్తపై కూడా పన్నులు విఽధించి చెత్తము ఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారన్నారు. ఇటువంటి పాలన కొనసాగితే రాష్ట్రం అతలాకుతలమవుతుందని చంద్రబాబును ముఖ్య మంత్రిగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్‌ ప్రతినిధి సాలక్కగారి శ్రీనివాసులు, కన్వీ నర్‌లు రామక్రిష్ణ, ఒలిపి శ్రీనివాసులు, మాజీ ఎంపీపీ వాణీ శ్రీనివాస్‌, మహిళా నాయకురాళ్లు మాధవి, రాధమ్మ, నాయకులు నాగేంద్ర ప్రసాద్‌, గాజులచంద్ర, కిశోర్‌, సైకిల్‌షాపుబాబా, షర్పుద్దీన్‌, బోయరాజు, కిరణ్‌, సురేశ్‌, వడ్డెశంకర, ఎర్రపల్లికేశప్ప,శ్రీనివాసులు, లక్ష్మీనారా యణ, చికెన్‌నాగేంద్ర, సుబ్బరాయుడు, గంగాధర్‌, సత్తి, కిలారిశ్రీనాథ్‌, రమేశ్‌, సుధాకర్‌, ఐస్‌ వెంక టేశ్‌,సాయి, రమేశ్‌రెడ్డి, జేసీబీశ్రీనాథ్‌, రఘుపతి, పెద్దన్న  పాల్గొన్నారు.

కదిరి: రక్తదానం చేసి ఆపదలో ఉన్న పది మందికి ప్రాణదానం చేద్దామని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌, మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టీరామారావు వర్థంతి సందర్భంగా మంగళవారం స్థానిక ఆర్యవైశ్య కల్యాణ మండపంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈసందర్బంగా ఆయన మా ట్లాడుతూ  రక్తదానం వల్ల ఆపద ఉన్న పది మంది ప్రాణాలను కాపాడగలు గుతామన్నారు. ఎన్‌టీ రామారావు బడుగు, బలహీనులకు రాజ్యధికారం ఇచ్చారని కొనియాడారు. ఈకార్యక్రమంలో టీడీపీ నాయకులు మోపురిశెట్టి చంద్రశేఖర్‌, షేక్‌ బాబ్‌జాన్‌, కొమ్మినేని గంగయ్య నాయుడు, అల్ఫా ముస్తఫా, మేకల రమణ,ఖాదర్‌బాష, డైమండ్‌ ఇర్ఫాన్‌, షాఇమ్రాన్‌, వడ్డేబాబు, పాల రమణ, మనోహర్‌ నాయుడు, రాజేంద్రనాయుడు, గోపాల్‌ నాయుడు, మహేం ద్ర, కుటాగుళ్ల రామన్న, సులేమాన్‌, కాటం మనోజ్‌, రొద్దం బషీర్‌, సాలంకి హనుమంతరావు, ఇస్మాయిల్‌, పాశం రమణనాయుడు, ముబా రక్‌, ఎద్దుల రాముడు, కొండయ్య, పవన్‌, అంజినాయక్‌, చంద్ర శేఖర్‌ నాయుడు, నాగభూషణం నాయుడు, బీగం శంకర్‌నా యుడు, సోంపాలెం నాగభూషణం, హరి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-01-19T07:04:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising