ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగాల పేరుతో మోసం

ABN, First Publish Date - 2022-07-05T06:08:15+05:30

ప్రభుత్వ శాఖల్లో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేసి మోసగిస్తున్న ముఠాలోని ఇద్దరిని అనంతపురం టూటౌన పోలీసులు అరెస్ట్‌ చేశారు.

అరెస్ట్‌ వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డబ్బు వసూలు చేసిన ఇద్దరి అరెస్ట్‌


అనంతపురం క్రైం, జూలై 4: ప్రభుత్వ శాఖల్లో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేసి మోసగిస్తున్న ముఠాలోని ఇద్దరిని అనంతపురం టూటౌన పోలీసులు అరెస్ట్‌ చేశారు. నగరంలోని అరవింద నగర్‌కు చెందిన మోటిరెడ్డి శివప్రకా్‌షరెడ్డి, కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం ఇందిరానగర్‌కు చెందిన గుండాల భగవాన ప్రశాంతబాబులను అరెస్ట్‌ చేసి, వారి నుంచి నకిలీ అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌ కాపీలను స్వాధీనం చేసుకున్నారు. విజయవాడకు చెందిన జయరామిరెడ్డి, విజయ్‌కుమార్‌లను అరెస్ట్‌ చేయాల్సి ఉందని పోలీసులు తెలిపారు. సోమవారం టూటౌన పోలీ్‌సస్టేషనలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ రాఘవన, ఎస్‌ఐ శ్రీనివాసులుతో కలిసి అనంతపురం ఇనచార్జ్‌ డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు అరెస్ట్‌ వివరాలు వెల్లడించారు. 


కాలయాపనతో అనుమానం


నగరంలోని అరవిందనగర్‌కు చెందిన మోటిరెడ్డి శివప్రకా్‌షరెడ్డి, కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం ఇందిరానగర్‌కు చెందిన గుండాల భగవాన ప్రశాంతబాబు, విజయవాడకు చెందిన జయరామిరెడ్డి, విజయ్‌కుమార్‌లు ఒక ముఠాగా ఏర్పడి ప్రభుత్వ శాఖల్లో ఏపీ కార్పొరేషన ఫర్‌ ఔట్‌ సోర్స్‌ సర్వీ్‌స(ఆప్కోస్‌) ద్వారా ఉద్యోగాలు ఇప్పిస్తామని కొంతమందిని నమ్మించారు. నిరుద్యోగుల నుంచి ఈ ముఠాలోని శివప్రకా్‌షరెడ్డి, ప్రశాంతబాబులు ఒక్కొక్కరి నుంచి రూ.2.3లక్షలు వసూలు చేశారు. వారిని విజయవాడ తీసుకొని వెళ్లి అక్కడ జయరామిరెడ్డిని పరిచయం చేశారు. అతని ద్వారా నకిలీ అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌ కాపీలను అభ్యర్థులకు ఇచ్చి నమ్మకం కలిగేలా వారి అకౌంట్‌కు ఒక నెలకు జీతం రూ.21,500లు వేశారు. డిస్ర్టిక్ట్‌ కోఆర్డినేటర్‌గా విజయ్‌కుమార్‌ ఉంటారని నమ్మించారు. ఆ తరువాత వేతనం రాకపోవడంతో పాటు వారు కాలయాపన చేయడంతో బాధితులకు అనుమానం వచ్చింది. ఈక్రమంలో బాధితుడైన శింగనమలకు చెందిన పట్నం నరే్‌షకుమార్‌ టూటౌన పోలీసులను ఆశ్రయించారు. సీఐ రాఘవన ఆధ్వర్యంలో దర్యాప్తు చేసి ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో ఈ తరహా మోసానికి ఇప్పటి వరకూ ముగ్గురు గురైనట్లు పోలీసుల విచారణలో తేలింది. 



Updated Date - 2022-07-05T06:08:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising