ఫిట్‌మెంట్‌పై ఆవేదన
ABN, First Publish Date - 2022-01-13T05:59:35+05:30
రాష్ట్రప్ర భు త్వం ప్రకటించిన ఫిట్‌మెంట్ ఏ మాత్రం ఆమోదయోగ్యంగా లేదనీ, ఉద్యోగులు, కార్మికులు, పెన్షనర్లలో ఆవేదన, ఆక్రోశం పెల్లుబుక్కుతోంద ని యూటీఎఫ్ నా యకులు ధ్వజమెత్తారు. బు ధవారం నగరంలోని సంగమేష్ సర్కిల్ నుంచి కలెక్టరే ట్ వరకూ ర్యాలీ చేశారు.
యూటీఎఫ్ నాయకుల ర్యాలీ, ధర్నా
అనంతపురం విద్య, జనవరి 12: రాష్ట్రప్ర భు త్వం ప్రకటించిన ఫిట్‌మెంట్ ఏ మాత్రం ఆమోదయోగ్యంగా లేదనీ, ఉద్యోగులు, కార్మికులు, పెన్షనర్లలో ఆవేదన, ఆక్రోశం పెల్లుబుక్కుతోంద ని యూటీఎఫ్ నా యకులు ధ్వజమెత్తారు. బు ధవారం నగరంలోని సంగమేష్ సర్కిల్ నుంచి కలెక్టరే ట్ వరకూ ర్యాలీ చేశారు. తర్వాత కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు జయచంద్రారెడ్డి, ప్రధానకార్యదర్శి నాగేంద్ర, సీఐటీయూ నాయకుడు నాగేంద్ర, ఇతర నాయకులు మాట్లాడుతూ.. ఫిట్‌మెంట్ చూసి అన్ని వర్గాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోందన్నారు. హెచఆర్‌ఏ స్లాబ్‌లపై గందరగోళాన్ని సృష్టించారన్నారు. వెంటనే మెరుగైన పీఆర్సీ ప్రకటించాలనా, లేకుంటే దాని ఫలితం అనుభవిస్తారని హెచ్చరించారు. 3, 4, 5 తరగతుల విలీనం ఆపాలనీ, లేకుంటే గ్రామ ప్రజలు, మేధావులతో కలిసి పోరాటం చేస్తాన్నారు. సీపీఎస్ రద్దు చేయాలన్నారు. పీఎఫ్, ఏపీజీఎల్‌ఐసీ ఇతర ప్రయోజనాలను వెంటనే ఉద్యోగులు, ఉపాధ్యాయులకు విడుదల చేయాలన్నారు. కార్యక్రమంలో సం ఘాల నాయకులు లింగమయ్య, సుధాకర్, నాగేంద్రకుమార్, వెంకటేష్, మనోహర్‌రెడ్డి, రమణ య్య, గోవిందరాజులు, కోటేశ్వరప్ప, దేవేంద్రమ్మ, మారుతి, శ్రీనివాసులు, అబ్దుల్ పాల్గొన్నారు.
Updated Date - 2022-01-13T05:59:35+05:30 IST