ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంట రుణాల రెన్యువల్‌కు రైతుల పడిగాపులు

ABN, First Publish Date - 2022-05-25T05:26:27+05:30

పంట రుణాల రెన్యువల్‌కు రైతులు నానా క ష్టాలు పడుతున్నారు. ఈనెల ప్రారంభం నుంచి మండలకేంద్రం లోని కెనరాబ్యాంకు రుణాల రెన్యువల్‌లో రద్దీగా మారింది.

కెనరా బ్యాంకు ఎదుట వేచి ఉన్న రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రొద్దం, మే 24: పంట రుణాల రెన్యువల్‌కు రైతులు నానా క ష్టాలు పడుతున్నారు. ఈనెల ప్రారంభం నుంచి మండలకేంద్రం లోని కెనరాబ్యాంకు రుణాల రెన్యువల్‌లో రద్దీగా మారింది.  రైతు ల నుండి వడ్డీ మాత్రమే కట్టించుకుని బ్యాంకు అధికారులు రెన్యువల్‌ చేస్తున్నారు. ప్రతిరోజూ అధిక సంఖ్యలో రైతులు బ్యాంకు వ ద్దకు చేరుకుంటున్నారు. ఉదయం 9 గంటలకు బ్యాంకు సిబ్బంది ఇచ్చే టోకన్లు తీసుకుని క్యూలో నిలబడుతున్నారు. సాయంత్రం వరకు వేచి ఉన్నా చాలామందికి రుణాలు రెన్యువల్‌ కావడం లే దు. దీంతో నిరాశతో ఇంటిముఖం పడుతున్నారు. వృద్ధులు, ది వ్యాంగులు, మహిళలకు టోకన్లు దొరక్క, రెన్యువల్‌ చేసుకోలేక రో జుల తరబడి బ్యాంకుల చుట్టూ తిరిగి వేసారి పోతున్నామని వా పోతున్నారు. కెనరాబ్యాంక్‌లో నలుగురు సిబ్బంది ఇటీవలే బదిలీ పై వెళ్లారు. మిగిలిన నలుగురు సిబ్బందికి పనిఒత్తిడి పెరిగింది. దీంతో రైతులకు న్యాయం జరగడం లేదన్న విమర్శలు ఉన్నాయి. మంగళవారం మేనేజర్‌ సెలవు పెట్టడంతో మిగిలిన ముగ్గురు సి బ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం 11.50 నిమిషాలైనా రైతుల రుణాలు రెన్యువల్‌ చేసుకోవడానికి బ్యాంకు లోపలికి అను మతించలేదు. దీంతో బ్యాంకు ఎదుటే  వందలాది మంది రైతులు వేచి చూశారు. బ్యాంకు ఉన్నతాధికారులు సిబ్బందిని పెంచి సజావుగా రెన్యువల్‌ జరిగేలా చూడాలని రైతులు కోరుతున్నారు. 

Updated Date - 2022-05-25T05:26:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising