ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యవసాయాధికారులపై రైతులు ఆగ్రహం

ABN, First Publish Date - 2022-06-26T05:49:52+05:30

పంటల బీమా పరిహా రంలో అవకతవకలు జరిగాయని, వాటిని నిగ్గుతేల్చాలని బొక్సంపల్లి గ్రామంలో రైతులు వ్యవసాయాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అధికారులతో మాట్లాడుతున్న రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రొద్దం, జూన 25 : పంటల బీమా పరిహా రంలో అవకతవకలు జరిగాయని, వాటిని నిగ్గుతేల్చాలని బొక్సంపల్లి గ్రామంలో రైతులు వ్యవసాయాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం రొద్దం మండల పరిధిలోని బొక్సంపల్లి గ్రామంలో పెనుకొండ వ్యవసాయ శాఖ ఏడీ స్వయంప్రభ, కొత్తచెరువు వ్యవసా యాధికారి నటరాజ్‌, రొద్దం వ్యవసా యాధికారి నివేదిత, బుక్కపట్నం వ్యవసాయా ధికారి సతీష్‌బాబు  విచారణకు బొక్సంపల్లికి వెళ్లగా రైతులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటల బీమా పరిహారం బీడు భూములకు వచ్చిందని, తక్కువ సాగుచేసి ఎక్కువగా పరిహారం వచ్చేలా ఈకేవైసీ చేయించుకు న్నారని రైతులు వ్యవసాయా ధికారులపై మండిపడ్డారు. గ్రామంలో జరిగిన అవకతవ కలను నిగ్గుతేల్చాలని 70 మంది రైతులు వ్యవ సాయాధికారులను నాలుగు గంటల పాటు నిలదీశారు. పొలాల్లోకి వచ్చి ఎవరుపంట వేశా రో, వేయలేదో తేల్చేదాకా వదలమని భీష్మించా రు.  వ్యవసాయాధికారులు మాట్లాడుతూ.. అధికశాతం పరిహారం వచ్చిన రైతుల ఖాతా లను హోల్డ్‌లో పెట్టామన్నారు. ఈకేవైసీ చేయిం చుకున్న రైతులకు మరోమారు జెరాక్స్‌ కాపీ ప్రతులను అందిస్తే న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ వెంకటరామిరెడ్డి, రైతులు రామాం జినేయులు, గోవర్దనరెడ్డి, లక్ష్మీరెడ్డి, బైలన్న, ఆంజనేయులు, రామాంజి నమ్మ, సంజీవమ్మ, శాంతమ్మ,  అనిత పాల్గొన్నారు. 


Updated Date - 2022-06-26T05:49:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising