ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శారదానగర్‌లో ఓపెన స్పేస్‌

ABN, First Publish Date - 2022-01-29T05:41:16+05:30

జిల్లా కేంద్రంలోని ఖరీదైన స్థలం. విలువ రూ.15 కోట్లకుపైగానే ఉంటుంది. నగర పాలక సంస్థకు చెందినదే. అయినా అధికారులకు పట్టడంలేదు.

లే ఔట్‌అప్రూవల్‌ కాపీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖాళీస్థలంపై కన్ను

స్వాధీనం చేసుకోని నగరపాలిక

కాజేసేందుకు అధికారపార్టీ వారి యత్నం

ప్లాట్లలో ఇళ్లు కట్టుకునేవారికి తప్పని తిప్పలు


జిల్లా కేంద్రంలోని ఖరీదైన స్థలం. విలువ రూ.15 కోట్లకుపైగానే ఉంటుంది. నగర పాలక సంస్థకు చెందినదే. అయినా అధికారులకు పట్టడంలేదు. స్వాధీనం చేసుకోవడం లేదు. ఎందుకు..? అని అడిగితే, తమకు రాసివ్వలేదని అంటున్నారు. ఇక.. ఖాళీగా ఉన్న ఆ స్థలంపై అధికార పార్టీకి చెందిన కొందరు నాయకుల కన్ను పడింది. చవకగా కొట్టేసేందుకు చకచకా పావులు కదుపుతున్నారు. కార్పొరేషన అధికా రులు చోద్యం చూస్తున్నారు.


అనంతపురం కార్పొరేషన, జనవరి 28: 

నగరపాలక సంస్థ అధికారుల నిర్లక్ష్యం కారణంగా రూ.15 కోట్లుపైగా విలువైన భూమి అన్యాక్రాంతమవుతోంది. ఓపెన స్పేస్‌ కింద దక్కాల్సిన ఆ భూమి అనంతపురం కార్పొరేషన స్థలాల జాబితాలో లేదట. కనీసం పరిరక్షించాల్సిన ఖాళీ స్థలాల జాబితాలో కూడా లేదు. నగరపాలక సంస్థకు చెందిన ఎన్నో స్థలాలు ఇప్పటికే కబ్జాకు గురయ్యాయి. కొన్నాళ్లు గడిస్తే.. ఈ విలువైన స్థలంకూడా కబ్జా జాబితాలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

అనంతపురం శారదానగర్‌లోని సర్వే నెంబరు 315/2లో 12 ఎకరాల స్థలంలో సుమారు 30 సంవత్సరాల క్రితం లే అవుట్‌ వేసి, ప్లాట్లు వేశారు. అప్రూవల్‌ కోసం అనంతపురం మున్సిపాలిటీకి దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు ప్లాన అప్రూవల్‌ ఇస్తూ, లే ఔట్‌ ప్లాన(ఎల్‌పీ) నెంబరు 98/85 కేటాయించారు. ఆ స్థలంలో 1.08 ఎకరాలను ఓపెనస్పే్‌స కింద వదిలారు. కానీ ఇప్పటికీ నగరపాలక సంస్థ స్వాధీనం చేసుకోనట్లు తెలుస్తోంది. దీన్ని కాజేసేందుకు ఒకప్పుడు లే ఔట్‌ వేసిన వ్యక్తిని సంప్రదించి బేరమాడినట్లు విశ్వసనీయ సమాచారం. రూ.60 లక్షలకు కొనుగోలు చేసేలా ఒప్పందం చేసుకుని, అడ్వాన్సుగా రూ.20లక్షలు ముట్టజెప్పే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. స్థలంపై కన్నేసినవారిలో ఒకరికి నగరపాలక సంస్థ పాలకవర్గంతో అనుబంధం ఉండటం గమనార్హం. ఆ ప్రాంతంలో సెంటు విలువ రూ.15 లక్షలు ఉంది. మొత్తం ఏకరానికి పైగా ఉన్నందున రూ.15 కోట్లుపైగానే విలువ చేస్తుంది. ఖాళీ స్థలాన్ని స్వాధీనం చేసుకోనివ్వకుండా నగరపాలిక అధికారులకు ఎవరైనా  అడ్డుపడుతున్నారా...? అధికారులే చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారా..? అన్నది తేలాల్సి ఉంది. 


అప్రూవల్‌ ఉన్నా.. 

లే ఔట్‌కు అప్రూవల్‌ ఇచ్చిన అధికారులు ఖాళీ స్థలాన్ని స్వాధీనం చేసుకోకపోగా, ప్లాట్లు కొన్నవారికి తలపోటు తెప్పిస్తున్నారు. కొన్న స్థలంలో భవనాలు నిర్మించుకోవాలంటే 14 శాతం బెటర్‌మెంట్‌ చార్జీలు చెల్లించాలని సూచిస్తున్నారు. నాన అప్రూవల్‌ లే ఔట్‌లో ఇళ్ల నిర్మాణానికి మాత్రమే బెటర్‌మెంట్‌ చార్జీలు వసూలు చేయాలి. కానీ అప్రూవ్డ్‌ లే ఔట్‌లో ప్లాట్లు కొన్న తమ నుంచి చార్జీలు ఎలా వసూలు చేస్తారని బాధితులు ప్రశ్నిస్తున్నారు. నగరపాలక సంస్థ అధికారుల తీరు కారణంగా ఇళ్లు కట్టుకోవాలని అనుకునేవారు ఇబ్బంది పడుతున్నారు. ఒక్కో భవన నిర్మాణానికి అదనపు చార్జీల కింద రూ.50 లక్షలకుపైగా చెల్లించాల్సి ఉంటుంది. 


14 శాతం కట్టమంటున్నారు..

శారదా నగర్‌లోని సర్వే నెంబరు 315/2లో 6.45 సెంట్ల స్థలం కొనుగోలు చేశాను. అప్రూవ్డ్‌ లేఔట్‌లో  ఉన్న ఆ స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు దరఖాస్తు చేసుకున్నాను. 14 శాతం బెటర్‌మెంట్‌ చార్జీలు చెల్లించాలని టౌనప్లానింగ్‌ అధికారులు అంటున్నారు. సచివాలయంలో అడిగితే టౌనప్లానింగ్‌ అధికారులను కలవమన్నారు. వారిని కలిస్తే సచివాలయానికే వెళ్లమంటున్నారు. ఎల్‌పీ నెంబరు సహా అన్ని ఆధారాలు చూపితే పరిశీలిస్తామని అంటున్నారు. నిబంధనల ప్రకారం ఇంటి నిర్మాణానికి అనుమతి ఇవ్వాలి.

- సూర్యనారాయణ, అనంతపురం


ఆక్రమిస్తే చర్యలు..

నగరపాలక సంస్థకు ఓపెనస్పే్‌సగా వచ్చిన స్థలాలను ఆక్రమించుకోవడానికి వీల్లేదు. సుప్రీంకోర్టు  సైతం ఈ విషయంపై స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఎల్‌పీ నెంబరు  98/85లో ఓపెన స్పేస్‌ ఉంది. కార్పొరేషన స్థలాన్ని కబ్జా చేస్తే చర్యలు తప్పవు. కమిషనర్‌ ఆదేశాల మేరకు ఖాళీ స్థలాలు ఆక్రమణకు గురికాకుండా దృష్టి సారిస్తున్నాం.

- శాసి్త్ర షబ్నన, టౌనప్లానింగ్‌ ఏసీపీ



Updated Date - 2022-01-29T05:41:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising