ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రంలో దుర్మార్గపు పాలన

ABN, First Publish Date - 2022-03-05T06:19:52+05:30

పేదల నుంచి ఓటీఎస్‌ పేరుతో బలవంతంగా డబ్బులు వసూలు చేస్తూ రాష్ట్రంలో దుర్మార్గపు పాలన సాగుతోందని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీని వాసులు ధ్వజమెత్తారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు 

  రాయదుర్గం, మార్చి 4: పేదల నుంచి ఓటీఎస్‌ పేరుతో బలవంతంగా డబ్బులు వసూలు చేస్తూ  రాష్ట్రంలో దుర్మార్గపు పాలన సాగుతోందని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీని వాసులు ధ్వజమెత్తారు. పట్టణంలోని 3,4,5 వార్డుల కు సంబంధించిన గౌరవ సభలను పార్టీ పట్టణ అధ్యక్షుడు పసుపులేటి నాగరాజు అధ్యక్షతన మా రెమ్మ గుడి వద్ద నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడారు. 30 యేళ్ల కింద ఇచ్చిన ఇళ్లకు ఓటీఎస్‌ పేరుతో బలవంతంగా రూ. 15 వేలు ప్రకారం వసూలు చేస్తున్నారని మం డిపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక్క ఇల్లు కూడా కట్టలేకపోయిన చేతకాని ప్రభుత్వమన్నారు. ప్రభు త్వం, నాయకుడు మారితే ఇన్ని కష్టాలు వస్తా యనే విషయం ప్రజలకు ఇప్పుడే అర్థమవుతోం దన్నారు.  ప్రతి వస్తువు ధరల ను పెంచి సామాన్యు లకు అందుబాటులో లేకుండా చేశారని మండిప డ్డారు. ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి తెల్లారి నప్పటి నుంచి ఎవరిపై పడి ఎంత దోచుకుం దామా అని ఆలోచిస్తూ ఉంటారని ఆరోపించారు. బళ్లారి బెంగళూరు లాంటి ప్రాంతాలకు ఇసుకను తర లించి దోచుకుంటున్నారన్నారు. చివరకు రిజిస్ట్రేషన్లు కూడా జరగకుండా ఆపేసి మన ఆస్తిని మనం అమ్ముకోలేని పరిస్థితిని తెచ్చిపెట్టారన్నారు. ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి దోచుకుంటున్నారని మండిప డ్డారు. నెలనెలా జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. చంద్రబాబు నాయకత్వం తోనే రాష్ట్రం బాగుపడుతుందని స్పష్టంచేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ ప్రశాంతితో పాటు మాజీ మున్సిపల్‌ ఛైర్మన్‌ ముదిగల్లు జ్యోతి, మాజీ కౌన్సిలర్‌ నల్లపూల వెంకటేశులు, కడ్డిపూడి మహబూబ్‌ బాషా, పొరాళ్లు పురుషోత్తమ్‌, బండిభారతి, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-03-05T06:19:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising